Health Care

ఆషాడంలో అమ్మాయిలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?


దిశ, ఫీచర్స్ : ఆషాడం వచ్చిందంటే చాలు అమ్మాయిల చేతులు గోరింటాకుతో ఎర్రగా కనిపిస్తాయి. అమ్మాయి అంటే అందం, ఆ అందానికే గోరింటాకు పెడితే ఇక చూడటానికి మన రెండు కళ్లు చాలవు. గోరింటాకుతో అతివల చేతులు చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే ఈ గోరింటాకు వారికి అందాన్నివ్వడంలోనే కాకుండా ఆరోగ్యంగా ఉంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మాములుగా అమ్మాయిలు, ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు గోరింటాకు లేదా మెహందీ పెట్టుకుంటారు. కానీ ఆషాడ మాసంలో మాత్రం చాలా మంది ఆడపిల్లలు తమ చేతులుకు ఐదు సార్లు లేదా, తొమ్మిది సార్లు గోరింటాకు పెట్టుకుంటారు. అయితే అసలు ఈ మాసంలోనే ఆడపిల్లలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? అసలు దీని వలన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీని గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుంటారు. అయితే కొంత మంది ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి వస్తారు. అయితే ఆ సమయంలో వారు తమ సౌభాగ్యాన్ని గుర్తు చేసుకుంటూ, తాను పుట్టింట్లో ఉన్నా తన మనసు మెట్టినింట ఉన్న తన భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుందంట. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు తనకు కాబోయే వాడిని ఊహించుకుంటూ గోరింటాకు పెట్టుకుంటారంట. అంతే కాకుండా ఎంత ఎర్రగా గోరింటాకు పండితే అంత మంచి భర్త వస్తాడని వారు భావించుకుంటారు.

ఇంకొంత మంది అభిప్రాయం ప్రకారం..వర్షాకాలంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. అలాగే ఆషాఢంలో పొలం పనులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో చర్మ వ్యాధులు, గోళ్లు దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి. అయితే అలాంటి వాటి నుంచి మన చర్మాన్ని రక్షించుకోవడానికి చేతులకు గోరిటాకు పెట్టుకుంటారు అంటున్నారు నిపుణులు. అంతే కాకుండా ఆషాఢంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి పోతుంది. దీంతో ఈ సీజన్‌లో కఫం, వంటి సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుంది. వాటి నుంచి బయటపడి, శరీరంలో వేడి తగ్గించడానికి గోరింటాకు పెట్టుకుంటారంట. ( నోట్ : ఇది ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)



Source link

Related posts

ఆదివారం రోజు ఈ పనులు చేస్తే అష్ట దరిద్రమేనట..! అవేంటంటే..?

Oknews

టీఎంసీ అంటే ఏమిటి?.. ఒక TMC నీరు ఎన్ని లీటర్లకు సమానం?

Oknews

గర్భిణీ స్త్రీలపై బొప్పాయి సైడ్ ఎఫెక్ట్స్

Oknews

Leave a Comment