EntertainmentLatest News

ఆసుపత్రి పాలైన జాన్వీ కపూర్.. దేవర పరిస్థితి ఏంటి..?


యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor ) ఆసుపత్రి పాలైంది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా తీవ్ర అస్వస్థకు గురి కావడంతో ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి జాన్వీని తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని సమాచారం.

బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న జాన్వీ తెలుగులోనూ వరుస అవకాశాలను అందుకుంటోంది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దేవర’ (Devara)తో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది జాన్వీ. సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ మూవీ చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ప్రస్తుతం దేవరలోని ఓ  పాట చిత్రీకరణలో జాన్వీ పాల్గొనాల్సి ఉందని తెలుస్తుండగా.. అనుకోకుండా ఇలా ఆసుపత్రి పాలైంది. దీంతో ఈ ప్రభావం దేవర విడుదలపై పడుతుందా అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే రెండు పాటలు మినహా దాదాపు షూటింగ్ అంతా పూర్తయిందని, అనుకున్న తేదీకే సినిమా వస్తుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.



Source link

Related posts

వర్కౌట్స్ తో ఫిదా చేస్తున్న స్టార్ హీరో భార్య

Oknews

మోదీకి ఓటెయ్యమంటే బాబుకి వెయ్యమన్నట్టేగా

Oknews

స్టార్‌ హీరోతో హీరోయిన్‌ ఎఫైర్‌.. వార్నింగ్‌ ఇచ్చిన భార్య!

Oknews

Leave a Comment