దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాపార దిగ్గజం, టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఏం చేసినా అది సంచలనంగా మారుతుంది. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసే కామెంట్స్, పోస్టులు తరచూ వైరల్ అవుతుంటాయి.అత్యధికమంది ఫాలోవర్లు కలిగిన వరల్డ్ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల్లో మస్క్ ఒకరు. ఆయనకు చెందిన టెక్ కంపెనీ న్యూరాలింక్ ఇటీవల మానవ మెదడులో అమర్చగలిగే ‘బ్రెయిన్ చిప్’ తయారు చేసి, మొదటిసారి ప్రయోగంలోనే సక్సెస్ అయిన విషయం తెలిసిందే. గతంలో స్పేస్ టూరిజానికి సంబంధించిన అనేక అంశాల్లో ఎలన్ మస్క్ చేసిన ట్వీట్లు ప్రపంచాన్ని ఆకర్షించాయి.
తాజాగా ఎక్స్(ట్విటర్) వేదికగా ఎలన్ మస్క్ షేర్ చేసిన మరో పోస్ట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఏంటంటే… ‘ఆస్టిమస్‌తో వాకింగ్‌కు వెళ్తున్న’ అనే క్యాప్షన్‌తో ఆయన ‘ఆప్టిమస్’ అనే ఒక హ్యూమనాయిడ్ రోబోట్ వీడియోను షేర్ చేశారు. ప్రజెంట్ ఇది తెగ వైరల్ అవుతోంది. ఇందులో రోబోట్ ఎంచక్కా నడుచుకుంటూ వెళ్తోంది. ఇది చూసి ఫిదా అయిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రోబో అద్భుతంగా ఉందని కొందరు పేర్కొనగా, ఇది మానవాళికి ప్రమాదకరంగా మారనంత వరకే మంచిదని మరికొందరు స్పందిస్తున్నారు. ప్రస్తుతం మనుషులు చేయలేని అనేక పనులు రోబోట్స్ చేయగలవని ఇంకొందరు అంటున్నారు. కాగా టెస్లా కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా ఈ అద్భుతమైన రోబోట్‌ను తయారు చేసింది.
Going for a walk with Optimus pic.twitter.com/6mLJCUp30F
— Elon Musk (@elonmusk) January 31, 2024