Health Care

ఆ ఆలయంలో దడపుట్టించే రహస్యాలు.. అర్ధరాత్రి అయ్యిందో అంతే సంగతి


దిశ, ఫీచర్స్ : భారతదేశంలోని దేవాలయాల్లో జరిగే కొన్ని అద్భుతాలు విని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. కొన్ని ఆలయాల్లో విచిత్రమైన శబ్దాలు వస్తుంటే, మరికొన్ని ఆలయాల్లో వింత సంఘటనలు జరుగుతుంటాయి. కానీ ఈ అద్భుతాలను గురించి ఎంత తెలుసుకుందాం అనుకున్న అస్సలు అంతుచిక్కవు. అలాంటి ఒక ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

భారతదేశంలోని బీహార్ రాష్ట్రం నలంద విశ్వవిద్యాలయానికి నిలయం మాత్రమే కాదు, బీహార్ పవిత్ర భూమిలో అనేక పురాతన రహస్య దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాల్లో జరిగే విచిత్ర కథణాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ఇలాంటి దేవాలయం ఉంది. అదే రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలో అనేక దేవతా విగ్రహాలు ఉన్నాయి. అమావాస్య రాత్రి వేళల్లో ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని పురాణాలు, అక్కడి పండితులు చెబుతున్నారు. ఈ రహస్యం గురించి తెలుసుకునేందుకు ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి ఇప్పటి వరకు ఫలించలేదని చెబుతున్నారు. అమావాస్య రోజు అర్ధరాత్రి ఈ ఆలయం నుండి కొన్ని వింత శబ్దాలు వస్తాయని స్థానికులు చెబుతారు.

త్రిపుర సుందరి ఆలయంలోని విగ్రహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయన్న విషయం క్రమంగా ప్రజల వరకు చేరింది. అప్పుడు శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎన్నో పరిశోధనలు ప్రారంభించారు. ఈ రహస్యాన్ని ఛేదించడానికి అనేక పద్ధతులు ఉపయోగించారు. కానీ ఆలయ రహస్యం మాత్రం ఇప్పటికీ తెలియలేదు.

త్రిపుర సుందరి ఆలయం సుమారు 400 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయాన్ని తాంత్రిక పూజలు చేసేందుకు, తాంత్రిక శక్తులను పొందేందుకు నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ సమంలోనే విగ్రహాలు మేల్కొన్నాయని చెబుతారు. అప్పటి నుండి ఈ విగ్రహాలు రాత్రిపూట ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాయని పండితులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో భయంకరమైన శబ్దాలు వచ్చే ఈ ఆలయం పగలంతా సర్వాంగ సుందరంగా ఉంటుంది.



Source link

Related posts

ఆకలి వేయకున్నా ఏదో ఒకటి తినేస్తున్నారా? .. ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే!

Oknews

దుఃఖంలో కూరుకుపోయారా..? ఆరోగ్యానికి మంచిదేనంటున్న నిపుణులు!

Oknews

Chat Gpt లో ప్రియమైన వారికి లేఖ.. ఎలాగో తెలుసా..

Oknews

Leave a Comment