Health Care

ఆ తేదీ తర్వాత నుంచి.. 3 నెలలు శుభ ముహూర్తాలు లేవు


దిశ, ఫీచర్స్: హిందూ సంప్రదాయాల ప్రకారం, వివాహం అనేది మనిషి జీవితంలో మరపురాని ఘట్టం. ఇద్దరు వ్యక్తులను ఒకచోట చేర్చడానికి రూపొందించబడింది. అయితే ఈ రోజుల్లో వివాహాలు హిందూ సంప్రదాయాల ప్రకారం జరగాలంటే.. జ్యోతిష్యం, పంచాంగం మొదలైన వాటి ప్రకారం శుభ కార్యాలు చేయాలంటే, ముందుగా జాతకంలో శుక్రుని స్థానాన్ని దృష్టిలో ఉంచుకుని ముహూర్తాలు నిర్ణయించబడతాయి.

ప్రతి ఏటా సీతా రాముల కళ్యాణం అవ్వగానే శుభ ముహూర్తాలకు చింత ఉండేది కాదు. దాదాపుగా మూడు నెలలు ఎటు చూసినా బాజా బజంత్రీలు మ్రోగుతూనే ఉంటాయి. అయితే ఈ సారి మూడు నెలలవరకు శుభ ముహూర్తాలు లేవు. ఏప్రిల్ 6 నుండి శ్రావణ మాసం వరకు వివాహ వేడుకలకు అనుకూలమైన తేదీలు లేవు. ఎందుకంటే ప్రతి ముహూర్తానికి శుక్రుడిని గురువును పరిగణలోకి తీసుకుని ముహూర్తాలు పెడతారు. సీతా రాముల కల్యాణం ఏప్రిల్ 17న, పట్టాభిషేకం 18న జరగనున్నాయి. ఈ వేడుక తర్వాత, 21వ తేదీన శుభ ముహూర్తం వస్తుంది. అయితే, మూడాలకు అతి దగ్గరగా ఉన్న తేది కావడం తో శుభ కార్యాలు చేయకపోవడమే మంచిదని జ్యోతిష్యులు అంటున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.



Source link

Related posts

ఎండలు ఎక్కువ ఉంటేనే మార్కులు తక్కువ వస్తున్నాయా?.. ఇంట్రెస్టింగ్ టాపిక్..

Oknews

CS ప్రొఫెషనల్, ఎగ్జిక్యూటివ్ ఫలితాల విడుదల ఎప్పుడంటే..

Oknews

ఈ ఏడాది హోలీ ఎప్పుడొస్తుంది.. హోలికా దహనం ముహూర్తం ఎప్పుడంటే..

Oknews

Leave a Comment