Health Care

ఆ పంపెనీలో పనిచేయడానికి క్యాబిన్ లే కాదు.. పడుకోవడానికి ప్రత్యేక గదులు కూడా ఉన్నాయట..


దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరూ మంచి కంపెనీలో పనిచేయాలని కోరుకుంటారు. వారి ఉద్యోగం సురక్షితంగా ఉండి, అన్ని రకాల సౌకర్యాలు ఉండే కంపెనీలలో ఎక్కువగా ఉద్యోగాలు చేసేందుకు చూస్తారు. పనితో పాటు ఉద్యోగుల క్షేమం గురించి ఆలోచించే కంపెనీలు చాలా తక్కువ. చాలా సార్లు ఎంప్లాయిస్ అనారోగ్యం పాలైనా కూడా ఆఫీసులో రెస్ట్ తీసుకునే సమయం ఉండదు. అలాగే కొన్ని కంపెనీలలో 12 నుంచి 15 గంటలు కూడా పని చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వారి కోసమే ఓ కంపెనీ అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది. ఈ కంపెనీలోని ఉద్యోగులు ఆడుతూ పాడుతూ ఇంట్లో ఉండి పనిచేసుకునేలా ఆఫీస్ అట్మాస్పియర్ ని క్రియేట్ చేశారు. ఇంతకీ ఆ సంస్థ ఏదో, దాని వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కంపెనీ పేరు మైక్రోసాఫ్ట్. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాఖలను కలిగి ఉంది. అలాగే భారతదేశంలో కూడా ఓ బ్రాంచ్ ను స్థాపించింది. ఇటీవల, మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల బృందం హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి చెబుతూ ఓ వీడియోను క్రియేట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆఫీస్‌లో తమకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో వీడియోలో చెప్పారు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో ఇన్‌స్టాల్ చేసిన వెండింగ్ మెషిన్‌ల నుండి కావలసినంత ఫుడ్ ఉచితంగా తినవచ్చని ఒకరు చెప్పారు. అలాగే నగరం అంతటా షటిల్ సేవలు అందుబాటులో ఉన్నాయి తెలిపారు.

ఇది మాత్రమే కాదు ఉద్యోగులు ఎక్కడి నుండైనా పనిచేసే సౌకర్యం ఉందని తెలిపారు. ఇది పని – జీవిత సమతుల్యతను కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుందని చెప్పారు. అలాగే ఉద్యోగులకు నిద్రవస్తే హాయిగా వెళ్లి పడుకోవడానికి వీలుగా ‘నాప్ రూమ్’లు కూడా ఏర్పాటు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో టూ సిస్టర్స్ లివింగ్ దేర్ లైఫ్ అనే ఐడితో షేర్ చేశారు. దీన్ని ఇప్పటి వరకు 2.3 మిలియన్ లేదా 23 లక్షల సార్లు వీక్షించారు.





Source link

Related posts

టీ షర్టు నుంచి ప్యాంటు వరకు.. మనం ధరించే దుస్తులు, అలంకరణల వెనుక పురాతన మూలాలు ఇవే..

Oknews

ఈ డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవడం వల్ల కంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

Oknews

వీటితో బరువు సులభంగా తగ్గొచ్చు.. అవేంటో తెలుసా?

Oknews

Leave a Comment