మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీని చేస్తున్నాడనే విషయం అందరికి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఆ మూవీ కంప్లీట్ అయ్యాక ఉప్పెన మూవీ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ సినిమాని చెయ్యబోతున్నాడు.ఇటీవల ఆ సినిమాలో నటించడానికి ఉత్తరాంధ్ర కళాకారులు కావాలని బుచ్చిబాబు చెప్పాడు.పైగా ఉత్తరాంధ్ర ఏరియాల్లో ఆడిషన్ కూడా జరుగుతుంది. తాజాగా ఆ మూవీకి సంబంధించిన రూమర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
రామ్ చరణ్ అండ్ బుచ్చి బాబుల మూవీ కథ ఇండియన్ హెర్క్యులస్ బిరుదుని పొందిన శ్రీకాకుళం జిల్లా మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోతుందనే వార్తలు విస్కృతంగా వ్యాపిస్తున్నాయి. గతంలో కూడా కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ ఆధారంగా చరణ్ న్యూ మూవీ తెరకెక్కబోతుందనే ప్రచారం జరిగింది.సో ఆ వ్యాఖ్యలకి బలాన్ని చేకూరుస్తూ ఇప్పుడు ఈ కూడా అవే మాటలు వినిపిస్తున్నాయి.అందుకే బుచ్చి బాబు ఉత్తరాంధ్ర కళాకారులని ఎంపిక చేసుకుంటున్నాడని అంటున్నారు.ఒక వేళ చరణ్ రామ్మూర్తి బయోపిక్ లో చేస్తుంటే మాత్రం అది ఒక రకంగా సాహసమనే చెప్పాలి. కాకపోతే ఆ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఒక వేళ అవే నిజమైతే చరణ్ రామ్మూర్తి పాత్రలో ఎలా అలరిస్తాడోనన్న ఆసక్తి కూడా అందరిలో నెలకొని ఉంటుంది. మరో వైపు కబడ్డీ నేపథ్యంతో కూడిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే మూవీ అనే రూమర్ కూడా వినిపిస్తుంది
కోడి రామ్మూర్తి నాయుడు తన బలప్రదర్శనలతో అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఛాతీ మీదకు ఏనుగును ఎక్కించుకుని ఐదు నిముషాల పాటు నిలపడం రెండు కార్లకి తాళ్లు కట్టి ఆ కార్లు ముందుకు కదలకుండా ఆపడం, ఒంటి చేత్తో రైల్ ఇంజను ఆపడం వంటి ఊహించని బల ప్రదర్శనలు ఆయన చేసినట్లుగా అక్కడి ప్రజలు చెప్తారు.అలాగే కొన్ని పుస్తకాల్లో ఆధారాలు కూడా ఉన్నాయి. కలియుగ భీమ, జయవీర హనుమాన్ అనే బిరుదులు కూడా ఆయనకి ఉన్నాయి.