తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన నటుల్లో ప్రభాస్ ఒకడు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే బాలీవుడ్ సినిమాలు కూడా భయపడే పరిస్థితి. తాజాగా ఆయన సలార్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 700 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి తన కట్ అవుట్ కి ఉన్న పవర్ ని చాటి చెప్పాడు. మరి అంతటి క్రేజ్ ఉన్న ప్రభాస్ నా కాళ్ళు పట్టుకున్నాడని ఒక వ్యక్తి చెప్పడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ గా మారింది.
సలార్ లో నారంగ్ గా నటించి మంచి పేరు సంపాదించిన ఆర్టిస్ట్ ఎంఎస్ చౌదరి. దాంతో ఇండియా వైడ్ గా సలార్ నారంగ్ గా ప్రసిద్ధి కెక్కాడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు సలార్ లో ప్రభాస్ ని కొట్టే పాత్ర ఏదైనా ఉంది అంటే అది నాదే. ఆ సీన్ ని దర్శకుడు మూడు యాంగిల్స్ లో షూట్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు.పైగా ఆ మూడు యాంగిల్స్ లో కూడా ప్రభాస్ నా కాళ్ళు పట్టుకోవాలి. ఆ టైం లో ప్రభాస్ కి డూప్ గా చేసే వ్యక్తి వచ్చి ఆ సీన్ ని నేను చేస్తా అన్నాడు. కానీ ప్రభాస్ మాత్రం డూప్ అవసరంలేదని నేనే చేస్తానని ఆ సీన్ ని కంప్లీట్ చేసాడని చౌదరి చెప్పుకొచ్చాడు.
అలాగే సలార్ షూటింగ్ అయిపోక ప్రభాస్ బెంగళూరు లో పార్టీ కూడా ఇచ్చాడు. ఆ పార్టీ కి చౌదరి కూడా వెళ్ళాడు.సాధరణంగా పెద్ద హీరోలతో మాట్లాడాలంటే చిన్న ఆర్టిస్ట్ లకి చాలా భయం ఉంటుంది. కానీ ప్రభాస్ తో చౌదరి భయం భయం గానే మాట్లాడాడు. అప్పుడు ప్రభాస్ తాను పెద్ద హీరో అనే గర్వం లేకుండా చాలా సరదాగా మాట్లాడాడు. ఈ విషయాన్నీ కూడా ఎంఎస్ చౌదరే చెప్పాడు. ప్రస్తుతం చౌదరి ఇంటర్వ్యూ నెట్టింట హల్ చల్ చేస్తుంది.