Entertainment

ఆ విషయంలో నన్ను తిట్టుకోకుండా కొంచెం ఓపిక పట్టండి.. మెగా ఫ్యాన్స్‌కి దిల్‌రాజు రిక్వెస్ట్‌!


‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, మెగాభిమానుల్లో ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. పైగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి గ్లోబల్‌ హిట్‌ తర్వాత వస్తున్న సినిమా కావడంతో శంకర్‌ ఈ సినిమాని ఎంతో అద్భతంగా తీర్చిదిద్దుతున్నాడని, ఓ ఐదు నెలలు ఓపిక పట్టాలని దిల్‌రాజు చెబుతున్నాడు. మార్చి 27 గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఒక ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో దిల్‌రాజు ‘గేమ్‌ ఛేంజర్‌’ గురించి కొన్ని ఆసక్తి కర విశేషాలు తెలిపారు. 

‘రామ్‌చరణ్‌గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు తెలుసు మీరందరూ ‘గేమ్‌ఛేంజర్‌’కి సంబంధించి ఏదో ఒక అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే ఈరోజు సినిమాలోని ‘జరగండి..జరగండి’ పాటను విడుదల చేశాం. మీ ఉత్సాహం చూస్తుంటే రిలీజ్‌ డేట్‌ కోసం అడుగుతున్నారని అర్థమైంది. ఈ విషయంలో మీ ఓపికకు చాలా పరీక్ష పెడుతున్నాం. ఒక ఉప్పెన, ఒక తుపాన్‌ వచ్చేముందు ఓపిక పట్టక తప్పదు. రామ్‌చరణ్‌ ఇప్పుడు మెగా పవర్‌స్టార్‌ కాదు, గ్లోబల్‌స్టార్‌ అయ్యారు. ఆ రేంజ్‌కి సినిమాని తీసుకెళ్ళడం కోసం శంకర్‌గారు ఒక్కోపాటని, సీన్‌ని తీర్చిదిద్దుతున్నారు. మరో రెండు నెలల్లో షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుంది. మీరు కాస్త ఓపిక పడితే నాలుగైదు నెలల్లో ‘గేమ్‌ ఛేంజర్‌’ మీ ముందుకు వచ్చేస్తుంది. రామ్‌చరణ్‌గారి బర్త్‌డే సందర్భంగా ‘జరగండి.. జరగండి..’ పాటను రిలీజ్‌ చెయ్యడం జరిగింది. ఈ పాటలో మీరు చూసింది 2 పర్సెంట్‌ మాత్రమే. 98 పర్సెంట్‌ శంకర్‌గారు దాచి పెట్టుకున్నారు. సినిమా రిలీజ్‌ అయిన తర్వాత థియేటర్‌లో ఆ పాటను చూస్తే దాని వర్త్‌ ఏమిటి అనేది అర్థమవుతుంది. ఇప్పటికే ఈ పాట మాస్‌లో ఎంత వెళ్ళాలో అంత వెళ్లింది. మరో మూడు రోజుల తర్వాత ఈ పాట గురించి ఇంకా గొప్పగా మాట్లాడుకుంటారు. ఈ పాటతోపాటు ఐదు పాటల్ని శంకర్‌గారు తన స్టైల్‌లో డిజైన్‌ చేసి పెట్టారు. అందులోని మూడు పాటలకు మాత్రం మీరు సీట్లలో కూర్చోరు. డాన్సులు చేస్తూ ఎంజాయ్‌ చేస్తారు. మరో 5 నెలలు నన్ను తిట్టుకోకుండా ఓపిక పట్టండి. ‘అరే దిల్‌ మామా మాకు ఒక అప్‌డేట్‌ ఇవ్వు’ అని మెసేజ్‌లు పెడుతున్నారు. దిల్‌ మామ అప్‌డేట్‌ ఇవ్వలేడు.. పైనుంచి శాటిలైట్‌ శంకర్‌గారు ఇది ఇవ్వు అన్నప్పుడే నేను ఇవ్వగలుగుతాను. చరణ్‌గారికి ఇది ఒక స్పెషల్‌ బర్త్‌డే క్లింకార లైఫ్‌లోకి వచ్చింది. చరణ్‌ కీపిట్‌ అప్‌. ఈరోజు తిరుమలలో దర్శనం చేసుకొని హైదరాబాద్‌ రీచ్‌ అయ్యారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ తప్పకుండా చరణ్‌గారి కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తుంది’ అన్నారు నిర్మాత దిల్‌రాజు. 



Source link

Related posts

ముద్దు సీన్స్‌లో నటించేటపుడు నా ఫీలింగ్స్‌ అలా ఉంటాయి : అంజలి

Oknews

జైలర్  సీక్వెల్ టైటిల్ ఇదే.. రజనీ ఫ్యాన్స్ సంబరాలు 

Oknews

ఆకట్టుకుంటున్న 'మెర్సీ కిల్లింగ్' ట్రైలర్…

Oknews

Leave a Comment