విశ్వ కథానాయకుడు కమల్ హాసన్ నట ప్రస్థానం గురించి అందరికి తెలిసిందే. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఆయన పోషించని పాత్ర లేదు. ఇంకా చెప్పాలంటే నటుడు కావాలనుకొని కలలు కనే వాళ్ళు ఆయన సినిమాలు చూస్తు నటనని నేర్చుకోవచ్చు. తాజాగా ఆయన ప్రముఖ హీరో తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.
తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన విజయ్ ప్రజలకి సేవ చెయ్యాలనే లక్ష్యంతో తమిళగ వెట్రి కజగం అనే పొలిటికల్ పార్టీ ని స్థాపించాడు.ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతు త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయడానికి అవసరమైతే సినిమాలు మానేస్తానని చెప్పాడు.ఇప్పుడు ఈ విషయంపైనే కమల్ స్పందించాడు. విజయ్ రాజకీయాల్లో రావడానికి నేను చాలా ప్రోత్సహించాను. ఆ విషయంపై మేమిద్దరం చాలా సార్లు చర్చించుకున్నాం కూడా. ఎవరైనా ఒక రంగంలో కొనసాగాలంటే ఇంకో దాన్నివదిలిపెట్టాలనే రూలేమీ లేదు. కాకపోతే సినిమాలా రాజకీయాలా లేక రెండునా అనేది విజయ్ ఇష్టం అని కూడా ఆయన చెప్పాడు.
విజయ్ గురించి కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాట హీట్ ని రేపుతున్నాయి. అయితే తాను మాత్రం సినిమాలు చేస్తూనే రాజకీయాలు చేస్తానని కమల్ చెప్పడం జరిగింది. కమల్ కూడా 2018 లో మక్కల్ నీది మయ్యం అనే పొలిటికల్ పార్టీని స్థాపించడం జరిగింది.అనంతరం జరిగిన ఎలక్షన్స్ లో ఆ పార్టీ తమిళనాట అంత ప్రభావాన్ని చూపించలేకపోయింది.ఆ ఎన్నికల్లో కమల్ కూడా ఓడిపోయారు. విజయ్ ని రాజకీయాల్లోకి రావడానికి ప్రోత్సహించానని కమల్ చెప్పిన నేపథ్యంలో ఇద్దరు కలిసి పొత్తు రాజకీయాలు ఏమైనా నడుపుతారేమోనని తమిళనాట చర్చలు మొదలయ్యాయి. కమల్ నటించిన ఇండియన్ 2 త్వరలోనే విడుదలకి సిద్ధం కాబోతుంది.