Health Care

ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్‌.. ఆరోగ్యానికి ఎందుకు మంచిది?


దిశ, ఫీచర్స్ : రెగ్యులర్ ఉపవాసాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయో లేదో కానీ ఇంటెర్ మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మాత్రం అనేక బెనిఫిట్స్ ఉన్నాయని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. ఇటీవల సోసల్ మీడియాలో దీనిగురించి చాలామంది డిస్కస్ చేస్తున్నారు. అప్పుడప్పుడూ ఉండే ఉపవాసాన్నే ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. అయితే ఇది గుండె ఆరోగ్యానికి చాలామంచిదని చెప్తున్నారు. ఎందుకంటే శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందట. వరల్డ్ వైడ్‌గా సంభవించే మరణాలకు గల అనారోగ్య కారణాల్లో గుండెపోటు జబ్బులు ప్రధానంగా ఉంటున్నాయి. ఈ ప్రమాదాన్ని నివారించే సులువైన నివారణ పద్ధతుల్లో ఇంటెర్ మిటెంట్ ఫాస్టింగ్ కూడా ఒకటిగా పేర్కొంటున్నారు నిపుణులు.

బెస్ట్ సొల్యూషన్

మంచి ఆరోగ్యం కోసం తినే కేలరీలను తగ్గించుకునేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఇలాంటి వారికి బెటర్ సొల్యూషన్ అడపాదడపా ఉపవామని చెప్పొచ్చు. ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ అనేది భారతీయ సాంప్రదాయ పద్ధతుల్లో ఒకటిగానూ ఉంటోంది. అందుకే శరీరంలో, గుండె నాళాల్లో కొలెస్ర్టాల్ పేరుకుపోకుండా ఇది అడ్డుకుంటుంది. ఈ ఫాస్టింగ్ శరీరంలోని చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. అధిక బరువును, డయాబెటిస్ ప్రమాదాన్ని నివారిస్తుంది.

ఎలా చేస్తారు?

ఇంటెర్ మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఒక నియమంతో కూడిన భోజన సమయంగా పేర్కొనవచ్చు. ఈ పద్ధతిని పాటించేవార ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆహారం తీసుకోకుండా ఉండటం ఒక మార్గం అయితే, ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు మరో పద్ధతి. అలాగే ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల మధ్య ఒకసారి తింటూ ఉపవాసం ఉండటం కూడా చేయవచ్చు. మొత్తానికి 12 గంటల ఫాస్టింగ్ అని చెప్పవచ్చు. ఈ రకమైన తినే అలవాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఏం జరుగుతుంది?

ఇంటెర్ మిటెంట్ ఫాస్టింగ్‌ అంటే అప్పుడప్పుడూ 12 గంటలపాటు ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో ఉండే అధిక మాంసకృత్తులు, కొవ్వులు, ఫైబర్స్ వంటివి సమతుల్యం అవుతాయి. అయితే ఉపవాసం ఉన్నప్పుడు పుష్కలంగా నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల హైడ్రేట్‌గా ఉంటారు. ఇక గర్భిణులు, బాలింతలు డయాబెటిస్ బాధితులు, చిన్న పిల్లలు ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ ఉండకూడదు.

ప్రయోజనాలు ఇవే..

ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్‌ వల్ల హైబీపీ, హై కొలెస్ట్రాల్ తగ్గుతాయి. హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్స్, కరోనరీ ఆర్టరీ డిసీజెస్ వంటివి రాకుండా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. కార్డియో వాస్క్యులర్ రిలేటెడ్ రిస్క్‌ తగ్గుతుంది. అలాగే అధిక బరువు తగ్గడంలో, టైప్-2 డయాబెటిస్ రిస్క్ నుంచి బయట పడటంలో గుండె, మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో, మానసిక ఆందోళనను దూరం చేయడంలో ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ అద్భుతంగా పనిచేస్తుంది.



Source link

Related posts

వేరుశనగలో అద్భుత పోషకాలు.. దీర్ఘకాలిక వ్యాధుల నివాణలో కూడా..

Oknews

ఇంట్రెస్టింగ్ న్యూస్.. మేక లేకపోతే కాఫీనే పుట్టేది కాదంట!

Oknews

లవర్స్ డే వచ్చేస్తుంది.. మీ అందానికి ఇలా మెరుగులు దిద్దండి

Oknews

Leave a Comment