హీరోయిన్ జాన్వి కపూర్ కోలుకుంది. ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. జాన్వికి ఫుడ్ పాయిజన్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆమె హాస్పిటల్ నుంచి బయటకొచ్చినప్పటికీ, మరో 2 రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోబోతోంది. ఈ మేరకు జాన్వి తండ్రి బోనీ కపూర్, బాలీవుడ్ మీడియాకు సమాచారం అందించాడు.
17వ తేదీన స్వల్ప అస్వస్థతకు గురైంది జాన్వి కపూర్. ఆ టైమ్ లో ఆమె చెన్నైలో ఉంది. ఒంట్లో ఏదో తేడాగా ఉందని ఆమె గుర్తించింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెన్నై నుంచి ముంబయి వచ్చేసింది.
అదే రోజు రాత్రి ఆమెకు సీరియస్ అయింది. మరుసటి రోజు పొద్దున్నే సౌత్ ముంబయిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో జాన్విని జాయిన్ చేశాడు బోనీ కపూర్. ఆమెకు తీవ్రమైన ఫుడ్ పాయిజన్ అయినట్టు వైద్యులు ప్రకటించారు.
హాస్పిటల్ లో జాయిన్ అయినప్పట్నుంచి, జాన్వి బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా ఆమెతోనే ఉంటున్నాడు. ఆమెను స్వయంగా తనే ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో కూడా జాన్వితో పాటు అతడే ఉంటున్నాడు. జాన్వికి ఎక్కడ ఫుడ్ పాయిజన్ అయిందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
The post ఇంటికి చేరిన జాన్వీ కపూర్ appeared first on Great Andhra.