ఇంటిని అమ్మకానికి పెట్టిన హీరోయిన్


హీరోయిన్ కమ్ పొలిటీషియన్ కంగనా రనౌత్ తన ఇంటిని అమ్మకానికి పెట్టింది. ఎంతో ఇష్టపడి డిజైన్ చేయించుకున్న ముంబయిలోని తన నివాసాన్ని ఆమె అమ్మాలని నిర్ణయించుకుంది.

ముంబయిలోని బాంద్రాలో కంగనాకు ఓ ఇల్లు ఉంది. అందులోనే ఆమె నిర్మాణ సంస్థ (మణికర్నిక ఫిలిమ్స్) ఆఫీస్ కూడా ఉంది. ఇప్పుడా ప్రాపర్టీని 40 కోట్ల రూపాయలకు అమ్మకానికి పెట్టింది కంగనా.

రాజకీయాలతో బిజీగా ఉన్న కంగనా ప్రస్తుతం ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లోనే ఎక్కువగా ఉంటోంది. దీంతో ముంబయిలో ఆమె తన నివాసాన్ని వదులుకోవాలని భావిస్తోంది. అలా అని ఆమె ముంబయికి దూరమవ్వడం లేదు. 3వేల చదరపు అడుగుల ఈ ప్రాపర్టీని అమ్మేసి, అంతకంటే పెద్ద ఇంటిని కొనుగోలు చేయాలనేది ఆమె ఆలోచన.

గతంలో ఇదే నివాసం వార్తల్లో నిలిచింది. 2020లో బాంబే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అక్రమ కట్టడంగా చూపిస్తూ, ఈ ఇంటిలో కొంత భాగాన్ని కూల్చివేశారు. దీనిపై న్యాయపోరాటం చేసి స్టే తెచ్చుకున్నారు కంగన. ఈ నివాసాన్నే ఇప్పుడామె అమ్మకానికి పెట్టారు.

The post ఇంటిని అమ్మకానికి పెట్టిన హీరోయిన్ appeared first on Great Andhra.



Source link

Leave a Comment