Entertainment

ఇంటి దారి పట్టిన శెట్టి ,పోలిశెట్టి


 

 

అనుష్క శెట్టి అండ్ నవీన్ పోలిశెట్టి ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా మిస్ శెట్టి ,మిస్టర్ పోలిశెట్టి.సెప్టెంబర్ 7 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్నే నమోదు చేసింది.ఒక పెళ్లి కానీ యువతీ స్పెర్మ్ డోనర్ సహాయం తో తల్లి కావాలనుకోవడం అనే సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ  సినిమా సరికొత్త ప్రపంచాన్ని ఆడియెన్స్ కి చూపించి సక్సెస్ ని కొట్టింది. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకులకి మరింత చేరువ కావడానికి ఓటిటి ప్లాట్ ఫార్మ్ లో అడుగుపెట్టింది.

ఈ మిస్ శెట్టి ,మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నవీన్ పోలిశెట్టి ,అనుష్కలు హీరో హీరోయిన్ లుగా నటించారు. బాహుబలి తర్వాత అనుష్క క్రేజ్ నేషనల్ లెవల్ కి వెళ్ళింది. అలాగే జాతి రత్నాలు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తరవాత నవీన్ క్రేజ్ కూడా ఆమాంతం పెరిగింది. సినిమా కెరియర్ పరంగా చాలా  గ్యాప్ తీసుకున్న ఆ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చెయ్యగానే ఆ సినిమా మీద సినిమా ఇండస్ట్రీ తో పాటు సినీ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే  ఏర్పడ్డాయి. అందరి అంచనాలకి తగ్గట్టుగానే  ఆ మూవీ  విడుదల అయి సూపర్ డూపర్ హిట్ అయ్యింది .అమెరికాలో నెంబర్ వన్ చెఫ్ గా పనిచేసే అనుష్క తన తల్లి  చివరి కోరిక మేరకు తనకి ఒక తోడు  అవసరమని  ఆ తోడు తన బిడ్డ అయ్యివుండాలని  అనుష్క భావిస్తుంది. దీంతో ఇండియాకి వచ్చి పెళ్ళి చేసుకోకుండా బిడ్డని కనాలనుకొని స్పెర్మ్ కోసం హీరో నవీన్ పోలిశెట్టి కి దగ్గరవుతుంది. స్టాండ్ అప్ కామెడీ లో నెంబర్ వన్ అవ్వాలనుకునే లక్షాన్ని నిర్ధేశించుకున్న నవీన్ స్టాండ్ అప్ కామెడీ లు చేసుకుంటూ ఉంటాడు.ఆ  తర్వాత  తన దగ్గరకి వచ్చిన అనుష్కని ప్రేమిస్తాడు. ఆ పై అసలు నిజం తెలుసుకొని అనుష్కకి దూరమయ్యి మళ్ళి అనుష్క కోరిక ప్రకారం అనుష్కకి  తన స్పెర్మ్ ని  దానం చేస్తాడు. ఆ తర్వాత ఏమయ్యిందనేది మిగతా కథ.

యూవీ క్రియేషన్స్  వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా  నిర్మించిన ఈ సినిమా కి మహేష్ దర్శకత్వం వహించాడు. సినిమా ఆసాంతం  ఫుల్ కామెడీ మోడ్ లో  సాగుతు ఒక అద్భుతమైన మెసేజ్ తో ఎండ్ అవుతుంది .అలాగే అనుష్క మరియు నవీన్ పోలిశెట్టి ల యాక్టింగ్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. ఓటిటి ద్వారా శెట్టి త్రయం మీ ఇంటికీ  వచ్చారు.ఇద్దరి అల్లరిని చూసి ఎంజాయ్ చెయ్యండి. 



Source link

Related posts

రెండు వసంతాలు పూర్తి చేసుకున్న 'ఆర్ఆర్ఆర్'

Oknews

ఫ్యాన్సీ రేటుకు 'లగ్గం' ఆడియో రైట్స్ !

Oknews

తీవ్ర నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

Oknews

Leave a Comment