మొత్తానికి ఇండియన్ 2 విషయంలో ఏదో జరగబోతుంది.నూటికి నూరుపాళ్లు ఏదో జరగబోతుంది.కాకపోతే అదేంటనేది ఎవరకి అర్ధం కావడం లేదు. ఎన్నో అవాంతరాలని ఎదుర్కొని షూటింగ్ ని జరుపుకుంది. పైగా రిలీజ్ కూడా చాలా లేటు అయ్యింది. ఈ నేపథ్యంలో వస్తున్న ఒక వార్త సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.
ఉలయ నాయగన్ కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2 మీద అందరిలో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా పాన్ ఇండియా మూవీ కావడంతో ఇండియా మొత్తం ఎదురుచూస్తు ఉంది. చాలా రోజులనుంచి మూవీకి సంబంధించిన అప్ డేట్ కోసం సోషల్ మీడియాలో వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు. అందులో ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి మూవీకి సంబంధించిన ఒక కీలక అప్ డేట్ చెప్తామని ప్రకటించారు. దీంతో ఇప్పుడు కమల్ అభిమానుల్లో ప్రేక్షకుల్లో జోష్ వచ్చినట్టయ్యింది. రిలీజ్ డేట్ ప్రకటిస్తారనే ఆశ అందరిలో ఉంది. అలాగే పోస్టర్ లో అవినీతి దేశానికీ క్యాన్సర్ లాంటింది.. అవినీతి చంపుతుంది అనే క్యాప్షన్ ని కూడా ఉంచారు. ప్రస్తుతం ఈ వార్త అయితే క్రేజీ న్యూస్ గా మారింది.
1996 లో వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కుతుంది.మొదటి భాగంలో లంచానికి వ్యతిరేకంగా పోరాడిన సేనాపతి ఇప్పుడు రెండవ భాగంలో ఏం చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలో ఉంది. కమల్ హాసన్ తో పాటు ప్రియా భవాని శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, ఎస్ .జె సూర్య, సిద్దార్ధ్ తదితరులు స్క్రీన్ షేర్ చేసుకున్నారు.జైలర్ తో సంచలనం సృష్టించిన అనిరుద్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. 250 కోట్ల భారీ బడ్జట్ తో సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ లు నిర్మిస్తున్నారు.