ఒక బిగ్ మూవీ థియేటర్ లో సంచలన విజయం సాధించింది. ఆటోమేటిక్ గా ఓటిటిలో కూడా సంచలన విజయాన్ని సాధిస్తుంది. అదే ఒక స్మాల్ మూవీ రెండు చోట్ల భారీ విజయాన్ని నమోదు చేస్తే.. పెను సంచలనమే అవుతుంది. ఓం భీం బుష్ ఇప్పుడు అదే సాధించింది.
ఓం భీం బుష్ గత నెల మార్చి 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్రర్ అండ్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చి హిట్ కొట్టింది. కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్ళని సాధించింది. ఈ నెల 12 న అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటిటిలోకి అడుగుపెట్టింది. అడుగుపెట్టడమే కాదు. ఇండియాలోనే ఓటిటి టాప్ ట్రెండింగ్ జాబితాలో నెంబర్ 2 పొజిషన్ లో నిలిచింది. వాస్తవానికి ఓటిటి లో విడుదలైన తొలి రోజు నుంచే తగ్గేదేలే అంటు టాప్ ట్రెండింగ్ జాబితాలో కొనసాగుతు వస్తుంది. తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా అనే హిందీ మూవీ టాప్ 1 లో ఉంది
ఇక ఓం భీం బుష్ విజయం చిన్న చిత్రాల్లో పెద్ద విజయం అని చెప్పుకోవచ్చు. ప్రముఖ హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లు ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కింది. అయేషా ఖాన్ హీరోయిన్ గా చేసింది. లాజిక్ లేని కామెడీ అనే క్యాప్షన్ తో వచ్చి అందుకు తగ్గట్టుగానే ప్రేక్షకుల్లో మరో ఆలోచన కలిగించకుండా నవ్వుల్లో ముంచెత్తింది. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వి సెల్యులాయిడ్, వి ఆర్ గ్లోబల్ మీడియాపై సునీల్ బలుసు నిర్మించాడు.