ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హీరోలదే పై చెయ్యి. ఈ విషయాన్నీ ఎవరు కాదనలేరు. వాళ్ళకి ఆ డామినేషన్ ని ఇచ్చింది ప్రేక్షకులే. వాళ్ళు హీరోని అభిమానించినంత ఇదిగా మరెవర్నీ అభిమానించరు. ఇదేం కొత్త విషయం కాదు. అందరకి తెలిసిందే. ఇక తాజాగా ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్(rajinikanth)గురించి ఒక వార్త బయటకి వచ్చింది.ఆ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చెయ్యడమే కాదు భారతీయ సినీ ప్రేక్షకుల పవర్ ని చాటి చెప్తుంది
ఇండియన్ సినీ మార్కెట్ లో రజనీ ఎప్పటినుంచో పాన్ ఇండియా స్థాయిలో ఉన్నాడు.ఆయన సినిమా రిలీజ్ అయిందంటే తమిళనాడు లో ఉన్న పరిస్థితే మిగతా చోట్ల ఉంటుంది. పైగా రికార్డు కలెక్షన్స్ ని సృష్టిస్తాయి. దాంతో ఆయన రెమ్యునరేషన్ కూడా భారీగానే పెరుగుతు వస్తుంది.తాజాగా ఆయన రెమ్యునరేషన్ కి సంబంధించిన వార్త టోటల్ ఇండియాన్ సినీ పరిశ్రమనే షేక్ చేస్తుంది. రజినీ ఒక సినిమాకి 280 కోట్లు తీసుకుంటున్నాడనే చర్చ వస్తుంది.జాతీయ స్థాయిలోనే ఈ న్యూస్ చక్కర్లు కొడుతుంది. దీంతో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వన్ అండ్ ఓన్లీ హీరోగా రజనీ రికార్డు సృష్టించాడు.
ఆ వార్తల్లో నిజం ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 2021 లో వచ్చిన అన్నాత్తే కి 200 కోట్లకి పైగానే తీసుకున్నారనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 280 కోట్లు తీసుకుంటున్నాడనే విషయంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. పైగా ఇటీవల జైలర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం వెట్టియాన్ మూవీ చేస్తున్నాడు. అక్టోబర్ లో అది విడుదల కానుంది. గతంలో తలపతి విజయ్(vijay) 230 కోట్లు తీసుకుంటున్నాడనే వార్త వచ్చింది.ఏది ఏమైనా ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారిలో తమిళ నటులే మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.