EntertainmentLatest News

ఇక రామ్‌చరణ్‌ రచ్చ మొదలు.. రెడీ అవుతున్న టీమ్‌!


రామ్‌చరణ్‌, శంకర్‌ రేర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గేమ ఛేంజర్‌’ కోసం చెర్రి ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఎప్పుడో స్టార్ట్‌ అయిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మూడు సంవత్సరాలపాటు షూటింగ్‌ జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. ఇటీవల విడుదలైన ‘భారతీయుడు2’ చిత్రాన్ని చూసి షాకైన మెగా అభిమానులు తమ హీరో సినిమాని  శంకర్‌  ఏం చేస్తాడోనని ఆందోళన చెందుతున్నారు. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌ అందుతున్నాయి. ఈ సినిమాని క్రిస్మస్‌ కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నామని దిల్‌రాజు చెప్పారు. అయితే ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్‌ జరుగుతూనే ఉంది. వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేసి డిసెంబర్‌లోనే రిలీజ్‌ చేసేందుకు షూటింగ్‌తోపాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను కూడా శరవేగంగా చేస్తున్నారని తెలుస్తోంది.

‘గేమ్‌ ఛేంజర్‌కి సంబంధించిన తాజా అప్‌డేట్‌ ఏమిటంటే.. బుధవారం నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో భాగంగా డబ్బింగ్‌ పనులు మొదలు పెట్టారని తెలుస్తోంది. మరో పదిరోజులు మాత్రమే షూటింగ్‌ బ్యాలెన్స్‌ ఉండడంతో అది కూడా త్వరగా పూర్తి చెయ్యాలని అనుకుంటున్నారు. అందుకే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా స్టార్ట్‌ చేశారట. మరో విషయం ఏమిటంటే.. త్వరలోనే టీజర్‌ రిలీజ్‌కి కూడా ప్లాన్‌ చేస్తున్నారట. రామ్‌చరణ్‌ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నవీన్‌ చంద్ర, సునీల్‌, శ్రీకాంత్‌, బాలీవుడ్‌ నటుడు హ్యారీ జోష్‌, కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

%ఇక ఈ విషయం పై ఇటు మోగా అభిమానులతో పాటు మూవీ లవర్స్‌ ఆ సాలిడ్‌ ట్రీట్‌ ను ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరీ ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. గేమ్‌ ఛేంజర్‌ లో రామ్‌ చరణ్‌, అంజలీ, కియారా అద్వానీ తో పాటు నవీన్‌ చంద్ర, సునీల్‌, శ్రీకాంత్‌, బాలీవుడ్‌ నటుడు హ్యారీ జోష్‌, కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్‌ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఇందులో రామ్‌ చరణ్‌ తండ్రీ, కొడుకు పాత్రలో నటించనున్నారట. మరీ, త్వరలోనే గేమ్‌ ఛేంజర్‌ మూవీ టీమ్‌ టీజర్‌ ప్లాన్‌ కు సన్నద్ధమవుతున్నరనే సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.



Source link

Related posts

ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్.. ఎప్పుడు ఎక్కడో తెలుసా..?

Oknews

Sonia Gandhi May Run for Rajya Sabha from Himachal Pradesh ఖమ్మం.. మనసు మార్చుకున్న సోనియా

Oknews

BRS dropped to third place? బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయిందా?

Oknews

Leave a Comment