Entertainment

ఇదసలు శ్రీను వైట్ల సినిమానేనా?


మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. చిత్రాలయం స్టూడియోస్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘విశ్వం’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టారు. అంతేకాదు తాజాగా ఫస్ట్ స్ట్రైక్ ని విడుదల చేసి సర్ ప్రైజ్ చేశారు మేకర్స్.

‘విశ్వం’ ఫస్ట్ స్ట్రైక్ ఆకట్టుకుంటోంది. నేపాల్ లోని ఒక ప్రాంతంలో శుభకార్యం జరుగుతుండగా.. గోపీచంద్ గన్ పట్టుకొని వెళ్లి, అందరినీ కాల్చి చంపుతూ విధ్వంసం సృష్టిస్తాడు. ఒకప్పుడు శ్రీను వైట్ల సినిమాలంటే కామెడీకి పెట్టింది పేరు. పైగా గోపీచంద్ కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. దీంతో వీరిద్దరూ కలిసి మంచి కామెడీ ఎంటర్టైనర్ తో వస్తారని అందరూ భావించారు. కానీ ఫస్ట్ స్ట్రైక్ లో వయలెన్స్ చూపించి షాకిచ్చారు. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.

కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా కె.వి. గుహన్, ఎడిటర్ గా అమర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.



Source link

Related posts

హిందీ డైరెక్టర్స్ తెలుగు డైరెక్టర్స్ ని చూసి నేర్చుకోండి

Oknews

లైఫ్ 'లవ్ యువర్ ఫాదర్' మూవీ గ్రాండ్ ఓపెనింగ్

Oknews

‘ఈగిల్’ మూవీ రివ్యూ

Oknews

Leave a Comment