ByMohan
Fri 05th Apr 2024 12:39 PM
పుష్ప, యానిమల్ సినిమాలతో నేషనల్ క్రష్‌గా మారిన కన్నడ కస్తూరి రష్మిక మందన్నా పుట్టినరోజు నేడు (ఏప్రిల్ 5). ఈ సందర్భంగా ఆమె నటిస్తోన్న సినిమాల నుండి మేకర్స్ న్యూ పోస్టర్స్‌ను విడుదల చేస్తున్నారు. ఈ పోస్టర్స్‌తో రష్మిక పేరుతో పాటు.. ఆయా పోస్టర్లకు సంబంధించిన సినిమాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో పుష్ప ద రూల్ సినిమాకు చెందిన పోస్టర్ అయితే.. ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. హ్యాపీ బర్త్‌డే శ్రీవల్లి అంటూ మేకర్స్ విడుదల చేసిన ఈ పోస్టర్‌తో మరోసారి పుష్పగాడి మాస్ జాతర ఎలా ఉండబోతుందో తెలుస్తోంది.
ఇంతకు అల్లు అర్జున్ పుట్టినరోజున టీజర్ అంటూ ప్రకటన నిమిత్తం వచ్చిన పోస్టర్ ఏ విధంగా ట్రెండ్ క్రియేట్ చేసిందో, పుష్ప గాడి రూల్ ఎలా ఉండబోతుందో.. ఫేస్ రివీల్ చేయకుండా వచ్చిన పోస్టరే సంచలనాన్ని క్రియేట్ చేయగా.. ఇప్పుడు రష్మిక మందన్నా శ్రీవల్లి లుక్ పోస్టర్ కేక అనేలా ఉంది. ఈ పోస్టర్‌లో రష్మిక లుక్ చూస్తుంటే.. ఇది కూడా జాతర సన్నివేశమే అని తెలుస్తోంది. ఇందులో రష్మిక సీరియస్‌గా చూస్తుండటం చూస్తుంటే.. ఈ సన్నివేశం ప్రేక్షకులకు కిక్ ఇవడం కాయం అనేలా క్లారిటీ వచ్చేస్తుంది.
పుష్ప ద రూల్ నుండే కాకుండా.. రష్మిక చేస్తున్న కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాల నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. మేకర్స్ పోస్టర్స్ విడుదల చేశారు. పుష్ప 2 పోస్టర్‌లో రష్మిక మాస్‌గా కనిపిస్తే.. ఈ రెండు సినిమాల పోస్టర్స్‌లో క్యూట్‌గా ఉంది. మరీ ముఖ్యంగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా పోస్టర్స్ చూస్తుంటే.. ఛలో సినిమాలో రష్మిక గుర్తొస్తుంది. మొత్తంగా అయితే రష్మిక బర్త్‌డే స్పెషల్‌గా వచ్చిన ఈ పోస్టర్స్.. ఆమెను టాప్‌లో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాయి. హ్యాపీ బర్త్‌డే రష్మిక మందన్నా.. #HappyBirthdayRashmikaMandanna
Rashmika Mandanna Birthday Special Posters Creates Sensation:
Rashmika Mandanna Srivalli Look From Pushpa The Rule Out