నిన్న గాక మొన్నే యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)తన అభిమానులకి ఒక మాట ఇచ్చాడు. టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో కాలర్ ఎగరేస్తు మరీ చెప్పాడు. దేవర మీ అందరు కాలర్ ఎగరేసేలా ఉంటుందని. అలా అన్నాడో లేదో ఇలా మాట నిలబెట్టుకున్నాడు.
ఎన్టీఆర్ కెరీర్లోనే మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీగా తెరకెక్కతున్న చిత్రం దేవర(devara) ఫ్యాన్స్ లోను ప్రేక్షకులోను భారీ అంచనాలే ఉన్నాయి. ఆది నుంచి ఎన్నో రికార్డులు సృష్టిస్తున్న దేవర ఇప్పుడు బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. దేవర నార్త్ థియేట్రికల్ రైట్స్ ని రెండు భారీ సంస్థలు దక్కించుకున్నాయి. అందులో ఒకటి ధర్మ ప్రొడక్షన్ కాగా, రెండోది A A సంస్థ. ధర్మ ప్రొడక్షన్ ప్రముఖ అగ్ర దర్శకుడు నిర్మాత అయిన కరణ్ జోహార్ (karan johar) ది. గతంలో బాహుబలి నార్త్ లో ఆ సంస్థ ద్వారానే విడుదల అయ్యింది.అలాగే ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి నిర్మాతలుగా కూడా వ్యవహరించాడు. ఇక A A సంస్థ కూడా బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని విడుదల చేసింది. కాంతారా వంటి భారీ హిట్ సినిమా వాళ్ళ ఖాతాలో ఉంది. ఇప్పుడు ఈ రెండు భారీ సంస్థలు కలిసి దేవర ని రిలీజ్ చేస్తుండటాన్ని బట్టి ఎన్టీఆర్ కెపాసిటీ ని అర్ధం చేసుకోవచ్చు.ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడి చేసాయి.కాకపోతే ఎంతకీ దక్కించుకున్నారనే విషయాన్నీ మాత్రం వెల్లడి చెయ్యలేదు.
అక్టోబర్ 10 న విడుదల అవుతున్న దేవర కోసం వరల్డ్ మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే రిలీజైన చిన్నపాటి టీజర్ సంచనాలు సృష్టిస్తుంది.కొరటాల శివ దర్శకత్వాన్ని వహిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యువ సుధా ఆర్ట్స్ లు నిర్మిస్తున్నాయి. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నాడు.