దిశ,ఫీచర్స్ : ఆయుర్వేదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ మెడిసిన్స్ కు తగ్గని వ్యాధులను కూడా దీనిలో తగ్గించుకోవచ్చు. ఎందుకంటే వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆయుర్వేదంలో వాడే శక్తివంతమైన మూలికలలో జిన్సెంగ్ కూడా ఒకటి. కానీ ఇప్పటిది కాదు. పురాతన కాలంలో ఉపయోగించిన ఔషధం. ముఖ్యంగా మన ఆరోగ్యాన్నిఈ మూలిక కాపాడగలదు.జిన్సెంగ్ , ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో జిన్సెంగ్ ను ప్రత్యేకంగా వాడే వాళ్లు. ఈ మొక్కలు పానాక్స్ జాతికి చెందినవి.
జిన్సెంగ్ రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో పాలీఫెనాల్స్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. దీన్ని తీసుకోవడం వలన ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాకుండా దీనిలో విటమిన్ సి, విటమిన్ ఎ పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇది మీ శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇది శతాబ్దాలుగా వైద్యంలో ఉపయోగిస్తున్నారు. కాబట్టి దీన్ని మీ రోజువారీ ఆహారంలో జిన్సెంగ్ చేర్చడండి
అంతే కాదు, బాగా అలసిపోయిన శరీరానికి ఎనర్జీ లెవల్స్ పెంచడంలో జిన్సెంగ్ ముందుంటుంది. మీ రోజువారీ ఆహారంలో జిన్సెంగ్‌ను చేర్చుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ జిన్సెంగ్ తీసుకోవాలని అంటున్నారు.
గమనిక: పైన రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించట్లేదు.