EntertainmentLatest News

ఇన్‌స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ రివ్యూ


 

వెబ్ సిరీస్ : ఇన్‌స్పెక్టర్‌ రిషి 

నటీనటులు: నవీన్ చంద్ర, సునైన ఎల్లా, శ్రీకృష్ణ దయాల్, కన్నా రవి, మాలినీ జీవరత్నం, ఎలాంగో కుమారవేల్, అశ్వత్ చంద్రశేఖర్ తదితరులు

ఎడిటింగ్: సతీష్ సూర్య

సంగీతం: అశ్వత్

సినిమాటోగ్రఫీ: భార్గవ్ శ్రీధర్

నిర్మాత: సుఖ్ దేవ్ లహరి

దర్శకత్వం: నందిని జేఎస్

కథ: 

ఓ అటవీప్రాంతంలో భిన్నమైన తెగ వారు కలిసి రాత్రిపూట ఓ అగ్నిగుండలో దూకి సాముహిక ఆత్మాహుతికి పాల్పడతారు. ఆ తర్వాత ఓ చెట్టులో నుండి భిన్నమైన ఆకృతి గల ఓ చెట్టు రూపంలోని భయంకరమైన ఆకృతి బయటకు వస్తుంది. అదే రోజు రాత్రి ఓ వ్యక్తి అనుకోని రీతిలో చనిపోతాడు. అది ఫారెస్ట్ అధికారులకి తెలిసి ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు. ఇక ఆ  కేసుని ప్రభుత్వం ‘ ఇన్‌స్పెక్టర్ రిషి ‘ కి అప్పగిస్తుంది. అయితే రిషి ఇన్వెస్టిగేషన్ మొదలెట్టాక వరుసగా హత్యలు జరుగుతుంటాయి. రిషి (నవీన్ చంద్ర) కు సపోర్ట్ గా అయ్యనార్(కన్నా రవి), చిత్ర(మాలినీ జీవరత్నం) ఇన్‌స్పెక్టర్లు ఉంటారు. వీరితో పాటు అటవీ అధికారులైన క్యాథీ(సునైనా), సత్య నంబీషన్(శ్రీకృష్ణ దయాల్), ఇర్ఫాన్(కుమారవేల్) కేసు ఇన్వెస్టిగేషన్ లో సపోర్ట్ ఇస్తారు. వరుస హత్యలని వనరచ్చి అనే వనదేవత చేస్తోందని ఆ ఊరిప్రజలు     నమ్ముతుంటారు. రిషి ఆ వనరచ్చిని కనిపెట్టాడా? లేక వనరచ్చి పేరు చెప్పి మరెవరైనా హత్యలు చేస్తున్నన్నారా? ఇన్‌స్పెక్టర్ రిషి ఈ వరుస హత్యల వెనక ఉన్న మిస్టరీని చేధించాడా లేదా తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలోని ఈ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:

ఓ చిన్న సాలెపురుగు మనిషిని చంపేసి చెట్టుకి వేలాడదీయడంతో ఆ హత్యని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇన్‌స్పెక్టర్ రిషి రావడంతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. ఇక అక్కడి నుండి ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్, మేకింగ్, స్క్రీన్ ప్లే, యాక్టర్స్ పర్ఫామెన్స్ అన్నీ ఒకదానికొకటి అల్లినట్టుగా సిరీస్ కి ప్రాణం పోశాయి.  ఒక్కో హత్యలో ఇన్ స్పెక్టర్ రిషి కలెక్ట్ చేసే ఆధారలు అన్నీ కూడా ఆకట్టుకుంటాయి. 

అయితే ఈ సిరీస్ మొత్తంగా పది ఎపిసోడ్‌ లు ఉంది. అందులో మొదటి ఎపిసోడ్ లో క్యారెక్టర్లు, హత్యలు, వనరచ్చి ఇలా ఓ లింక్ ఇచ్చి వదిలేశాడు‌‌. ఇక రెండో ఎపిసోడ్ లో వరుస హత్యల తీరుని ఇన్ స్పెక్టర్ వివరించే విధానం తర్వాత ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటిని రేకెత్తిస్తుంది.

కథలోని సీరియస్ నెస్, గ్రిస్పింగ్ గా ఉండే స్క్రీన్ ప్లే ప్రేక్షకులని చివరి ఎపిసోడ్ వరకు చూసేలా చేస్తాయి. ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ ని అర్థమయ్యేలా నీట్ గా అలా చూపించుకుంటు వెళ్ళారు మేకర్స్. సిరీస్ మొత్తంలో స్లోగా సాగుతుందనే ఫీలే రాలేదు. అడల్ట్ సీన్స్ ఏమీ లేకుండా బాగా జాగ్రత్తపడ్డారు. అయితే హారర్ ఎలిమెంట్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. నమ్మకాలకి, లాజిక్ లకి మధ్య సాగే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. 

ఈ సిరీస్ లో ఫ్రధాన చెప్పుకోవాల్సింది ఇన్వెస్టిగేషన్. రిషి ఒక్కో హత్యలో కనిపెట్టిన క్లూలని వివరిస్తూ వాటితో అసలు హంతకులని కనిపెట్టే సీన్స్ మెప్పిస్తాయి. అయితే కొన్ని సీన్లని ముందుగానే ఊహించేయొచ్చు. అయితే స్క్రీన్ ప్లే గ్రిస్పింగ్ గా ఉండటంతో ఎక్కడా విసుగు తెప్పించదు. అసభ్య పదజాలం ఎక్కడ వాడలేదు‌. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ కి సంబంధించిన అన్ని అంశాలని ఈ సిరీస్ లో ఓ పద్దతిగా మొక్కకి అంటుకడుతున్నట్టుగా వాడుకున్నారు మేకర్స్. చివరివరకు ఓ ఇంటెన్స్ ని క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. అయితే క్లైమాక్స్ లో సెకెండ్ పార్ట్ రాబోతుందన్నట్టు ముగించారు. అది ఈ సిరీస్ కి ఇంకా హైప్ ఇచ్చింది. వనరచ్చి వచ్చే సీన్స్ లో అశ్వత్ అందించిన బిజిఎమ్ అదిరిపోయింది. కథకి తగ్గట్టుగా మ్యూజిక్ సమకూర్చాడు. భార్గవ్ శ్రీధర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. అడవిలోని ప్రాకృతిక అందాలని తన కెమెరాలో చక్కగా చూపించాడు.  విఎఫ్ఎక్స్ టీమ్ కి పదికి పది మార్కులు వేసేయొచ్చు. అంతలా నైట్ సీన్స్ ని మలిచారు. నిర్మాణ విలువలు ఈ కథకి మరింత లుక్ ని తెచ్చిపెట్టాయి. 

నటీనటుల పనితీరు:

రిషి పాత్రలో నవీన్ చంద్ర ఒదిగిపోయాడు. సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. మిగతా వారు ఉన్నంతలో ఆకట్టుకున్నారు.

ఫైనల్ గా : సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ కథలని ఇష్టపడే వారికి ఈ సిరీస్ ఓ ఫీస్ట్. 

రేటింగ్ : 3.5/5

✍️. దాసరి మల్లేశ్



Source link

Related posts

budget 2024 what is lakhpati didi scheme know all about it in telugu | Lakhpati Didi Scheme : లఖ్‌పతి దీదీ పథకం పరిధిని పెంచిన కేంద్రం

Oknews

కన్నీళ్లు పెట్టుకుంటున్న బిగ్ బాస్ ప్రియాంక

Oknews

Telugu News Today From Andhra Pradesh Telangana 25 February 2024

Oknews

Leave a Comment