రెండు రోజుల క్రితం సీఎం హోదాలో సిద్దమేనా అంటూ బస్సు యాత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో ఒకరు రాయి విసిరిన ఘటన మీడియాలో చాలా వైరల్ అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి కూడా అదేదో పెద్ద దెబ్బ తిన్నట్లుగా బిల్డప్ ఇవ్వడమే కాదు. కుట్లు వేయించుకుని తన మీద దాడి చేసింది పెత్తందారుడు చంద్రబాబే అంటూ.. జగన్ తో పాటుగా వైసీపీ నేతలంతా చంద్రబాబునే టార్గెట్ చేసారు. టీడీపీ వాళ్ళే కావాలని చేసారంటూ గోల గోల చేసారు.
కానీ ఈరోజు జగన్ మోహన్ రెడ్డిపై పై కేవలం 350 రూపాయల కోసం దాడి జరిగిందంటూ పోలీసులు చెప్పడం అందరికి విడ్డురంగా అనిపించింది. సీఎం జగన్ పై రాయి విసిరిన కేసు నిందితుడుని పట్టుకున్న పోలీసులు అతను చెప్పిన వివరాలు విని అవాక్కయ్యారు. క్వార్టర్ మద్యం 350 రూపాయల డబ్బులు ఇస్తానంటే సీఎం సభకు వచ్చానని సతీష్ ఒప్పుకోవడమే కాదు.. మద్యం ఇచ్చి డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో రాయి విసిరినట్లు విచారణ లో సతీష్ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.
అయితే మళ్ళీ వైసీపీ నేతలు, జగన్ సైతం సతీష్ కు తెలుగుదేశం పార్టీ తో ఏవైనా లింకులు ఉన్నాయా అనే కోణాన్ని కనుగొనడానికి విశ్వ ప్రయత్నాలు చెయ్యడం అందరిని ఆశ్చర్యంలో పడేసింది. ఎలాగైనా ఈ దాడి ఘటన వెనుక టీడీపీ ఉంది అని నిరూపించాలనే తపనతో వైసీపీ కనిపిస్తుంది అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మరోపక్క సీఎంపై రాయి దాడి కేసులో తమ వారిని అక్రమంగా నిర్బంధించారని వడ్డెర కాలనీ వాసుల ఆందోళనకు దిగారు. పోలీసులు తీరుకు నిరసనగా డాబాకోట్ల సెంటర్ లో కాలనీవాసుల రాస్తారోకో చేస్తున్నారు. రూ.200 ఇస్తామని రోడ్ షోకు తీసుకెళ్లారని వడ్డెర కాలనీ వాసుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇస్తానన్న డబ్బు కూడా ఇవ్వలేదని, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉదయం నుంచీ తమ పిల్లల ఆచూకీ తెలియడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరి ఇదంతా టీడీపీ వారు చేసారని నిరూపిద్దామని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్న జగన్ బ్యాచ్ కి చేమటలు పట్టిస్తుంది. ఇప్పుడు చెప్పు జగన్ వారందరికీ ఏం సమాధానం చెబుతావో అంటూ టీడీపీ నేతలు జగన్ ని ప్రశ్నిస్తున్నారు.