ఇటీవల దక్షిణ భారతీయ సినీ పరిశ్రమలో ఒక పెను విషాదం చోటు చేసుకుంది.తన సంగీతంతో యావత్తు సినీ జగత్తుని ఒక ఊపు ఊపిన సంగీత సామ్రాట్ ఇళయరాజా కుమార్తె భవతారిణి రాజా పరమపదించారు. అనారోగ్యంతో శ్రీలంకలోని ఒక ఆసుపత్రిలో ఆమె మరణించింది. దీంతో ఒక్కసారిగా దక్షిణ భారతీయ సినీ పరిశ్రమ మొత్తం షాక్ కి గురయ్యింది. తాజాగా ప్రఖ్యాత నటులు మోహన్ బాబు ఇళయ రాజా ఇంటికి వెళ్లారు
మోహన్ బాబు చెన్నైలోని ఇళయరాజా స్వగృహానికి వెళ్లి భవతారిణి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఇళయరాజా కి ఆయన కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.ఇంతటి విషాద క్షణాన్ని తట్టుకునే శక్తిని ఇళయరాజాకి ఆయన కుటుంబానికి భగవంతుడు ప్రసాదించాలని ఆయన కోరుకున్నారు. మోహన్ బాబు వెంట ఆయన సతీమణి కూడా ఉన్నారు
ఇళయరాజా, మోహన్ బాబు కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ పాటలు వచ్చాయి. నేటికీ వాళ్ళిద్దరి కాంబోలో వచ్చిన కుంతీ పుత్రుడు సినిమాలోని లేలే బాబా నిద్దుర లేవయ్యా పాట నిత్యం ఏదో ఒక చోట మారుమోగిపోతూనే ఉంటుంది. అలాగే డిటెక్టివ్ నారద లోని సాంగ్స్ కూడా మంచి హిట్ గా నిలిచాయి.