Entertainment

ఇళయరాజా కుమార్తె భవతారిణి కన్నుమూత!


ప్రముఖ సంగీత దర్శకుడు మ్యాస్ట్రో ఇళయరాజా కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె భవతారిణి(47) కన్నుమూసింది. లివర్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె గత కొంతకాలంగా శ్రీలంకలో చికిత్స పొందుతోంది. గురువారం పరిస్థితి విషమించి సాయంత్రం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని ఈరోజు చెన్నయ్‌కి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

ఇళయరాజాకు ఇద్దరు కుమారులు కార్తీక్‌ రాజా, యవన్‌ శంకర్‌ రాజా. కుమార్తె భవతారిణి. ఈ ముగ్గురూ సినిమా రంగంలోనే ఉన్నారు. ‘భారతి’ అనే సినిమాలో భవతారిణి ఆలపించిన ‘మయిల్‌ పోల పొన్ను ఒన్ను’ అనే పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డు సాధించారు. ఆమె కెరీర్‌లో పాడిన పాటల్లో ఎక్కువ శాతం తండ్రి, సోదరుల సంగీత దర్శకత్వంలోనే పాడారు. తెలుగులోనూ వందకుపైగా పాటలు పాడిన మరణంపై సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.



Source link

Related posts

vakeel saab poster released movie released dates changes due to corona

Oknews

లండన్‌లో ప్రారంభమైన నూతన చిత్రం దీన్‌ తననా..

Oknews

nithya menon fires on social media posts

Oknews

Leave a Comment