కొండలు, గుట్టలకు రైతు భరోసా బంద్ధరణిపై(Dharani) ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే విషయాలు బయటపడతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తప్పులకు కారణమైన ఎవరినీ వదిలిపెట్టమన్నారు. కొండలు, గుట్టలు, లేఅవుట్లకు రైతు భరోసా(Rythu Bharosa) ఇచ్చేది లేదన్నారు. నిధుల దుర్వినియోగం జరగుకుండా అన్ని చర్యలు చేపడతామన్నారు. నిధుల దుబారా, ఆర్భాట ఖర్చులు పెట్టమన్నారు. జీఎస్టీ ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల విషయంలో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. అలాంటి వాటిపై దృష్టి పెట్టి రాష్ట్ర ఆదాయం పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Source link