‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ తర్వాత రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఆ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. ఆగస్ట్ 15న పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టైటిల్‌కి తగ్గట్టుగానే ఇస్మార్ట్ శంకర్‌కి డబుల్ రేంజ్‌లో మాస్ ఎలిమెంట్స్, రొమాన్స్, థ్రిలింగ్ ఎలిమెంట్స్, సెంటిమెంట్, కామెడీ, కొన్ని సైంటిఫిక్ అంశాలు ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈమధ్యకాలంలో ఇలాంటి పక్కా మాస్ ఎంటర్‌టైనర్ రాకపోవడంతో ట్రైలర్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.
మొదటి పార్ట్ తరహాలోనే ఇందులో కూడా కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేశాడు పూరి. మెమరీ ట్రాన్స్‌ఫర్ చేయడం ద్వారా హీరో రామ్.. విలన్ సంజయ్‌దత్‌లా మారడం అనేది సినిమాలో పెద్ద ట్విస్ట్‌గా కనిపిస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో హీరోకి ఒక చిప్‌ని అమర్చడం ద్వారా అతను రకరకాలుగా బిహేవ్ చేయడాన్ని మనం చూశాం. అసలు మానవ మెదడులో చిప్‌ని అమర్చడం సాధ్యమవుతుందా అని సినిమా చూసిన వారికి సందేహం కలగక మానదు. అది సాధ్యమేనని నిరూపిస్తున్నారు న్యూరాలింక్ సీఇఓ ఎలాన్ మస్క్. అయితే వెన్ను, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఉపయోగపడేలా ఈ డివైజ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ జనవరిలో మొదటిసారి ఒక వ్యక్తికి చిప్‌ను విజయవంతంగా అమర్చారు. ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడానికి ముందే 2019లో ఈ కాన్సెప్ట్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని రూపొందించారు పూరి జగన్నాథ్. ఈ చిప్ వినియోగం విషయంలో శాస్త్రవేత్తల అభిప్రాయాలు వేరుగా ఉన్నప్పటికీ తన సినిమాలో మాత్రం దాన్ని ఆడియన్స్‌ని థ్రిల్ చెయ్యడానికి మాత్రమే పూరి ఉపయోగించుకున్నారు. సాధాసాధ్యాలను పక్కన పెడితే బ్రెయిన్‌లో చిప్‌ని అమర్చడం అనే ప్రక్రియ మాత్రం ఆడియన్స్‌కి కొత్త అనుభూతిని ఇస్తుంది.
ఇక ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ విషయానికి వస్తే.. హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్, పూరి జగన్నాథ్ సినిమాల్లో కామన్‌గా ఉండే అలీ కామెడీ ట్రాక్, రaాన్సీ, ప్రగతి సెంటిమెంట్స్ సీన్స్.. ఊపునిచ్చే మణిశర్మ మ్యూజిక్, దానికి తగ్గట్టుగా ఉన్న పాటల పిక్చరైజేషన్.. ఇలా ప్రతి అంశంలోనూ కొత్త దనం చూపించాలని పూరి ట్రై చేశాడు. ముఖ్యంగా తెలంగాణ స్లాంగ్‌లో రామ్ చెప్పే డైలాగ్స్‌కి థియేటర్‌లో విజిల్స్ పడడం ఖాయం. క్లైమాక్స్‌ని చాలా భారీగా తీసారని ట్రైలర్‌లోని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది.
‘ఇస్మార్ట్ శంకర్.. అలియాస్ డబుల్ ఇస్మార్ట్’ అంటూ రామ్ చెప్పే డైలాగ్స్ థియేటర్‌లో బాగా పేల్తాయనిపిస్తుంది. సినిమాలో రామ్ ఎనర్జీ మెయిన్‌గా కనిపిస్తుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అలాగే అతనికి జోడీగా నటించిన కావ్య థాపర్ కూడా రామ్‌తో పోటీపడింది. పూరి జగన్నాథ్ స్టైలిష్ టేకింగ్‌తో పవర్‌ప్యాక్డ్ మూవీగా ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. వాటికి తగ్గట్టుగానే సినిమా ఉంటుందని ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది.