Health Care

ఈజీగా అధిక బరువు తగ్గాలా?.. మీ డైట్‌లో ఉండాల్సిన 5 సూపర్ ఫుడ్స్ ఇవే..


దిశ, ఫీచర్స్ : ఇటీవల చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో అధిక బరువు ఒకటి. మెట్రో సిటీస్‌లో నివసిస్తున్న ప్రజల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటోందని నిపుణులు చెప్తున్నారు. పలువురు జంటల్లో సంతానలేమికి కూడా ఇది కారణం అవుతోంది. అంతేకాకుండా కార్డియో వాస్క్యులర్ ఇష్యూస్, గుండె జబ్బులతో ముడిపడి ఉండటంవల్ల వెయిట్ తగ్గాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. కానీ ఎంత ట్రై చేసినా ఆహార నియమాలు, వ్యాయామాలు వంటివి లేకపోతే మాత్రం లాభం లేదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మీరోజువారీ డైట్‌లో తక్కువ కేలరీలు కలిగి ఉండాలని చెప్తున్నారు. అటువంటి కొన్ని ఆహారాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

పాలకూర

ఆరోగ్యానికి పాలకూర చాలామంచిది. ఇందులో అన్ని రకాల పోషకాలతోపాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, విటమిన్‌-ఎ,సి, కె. పుష్కలంగా ఉంటాయి. ఇక కేలరీల విషయానికి వస్తే వంద గ్రాముల పాలకూరలో కేవలం 26 కేలరీలు మాత్రమే ఉంటాయి. వాటర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. ఇవన్నీ బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇక విటమిన్ ఎ, బి, సి, కె, జింక్‌, మెగ్నీషియం, ఐరన్‌ పర్సంటేజ్ అధికంగా ఉండటంవల్ల రక్తహీనతను కూడా నివారిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్‌‌లో పాలకూర తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.

క్యారెట్

క్యారెట్‌లో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటాయి. వంద గ్రాముల క్యారెట్‌లో కేవలం 41 కేలరీలు ఉంటాయి. దీంతోపాటు బరువు తగ్గడానికి అవసరం అయిన పోషకాలు అధికంగా ఉంటాయి. బీటా కెరోటిన్, లుటీన్‌ వంటి పోషకాలు ఉండటంవల్ల కంటి ఆరోగ్యానికి మంచిది. ఇమ్యూనిటీ పవర్‌ను కూడా పెంచుతాయి. ఇక బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో క్యారెట్‌ను కచ్చితంగా చేర్చుకోవాలి.

కీరా..

కీరా ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. సమ్మర్‌లో అయితే ఇది చాలా మేలు చేస్తుంది. ప్రతి 100 కీరాలో కేవలం 15 కేలరీలు మాత్రమే ఉండటంవల్ల అధిక బరువు సమస్య రాకుండా ఉంటుంది. దాదాపు 96 శాతం వరకు వాటర్ కంటెంట్ కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని తినడంవల్ల డీహైడ్రేషన్ ప్రాబ్లం రాదు. ఫైబర్‌ కూడా అధికంగా ఉండటంవల్ల ఇతర ఆహారాలు ఎక్కువగా తినే కోరికను నిరోధిస్తుంది. ముఖ్యంగా కీరా మీ వెయిట్‌‌కు అద్భుతంగా ఉపయోగపడుతుంది.

క్యాబేజీ..

ప్రతి వంద గ్రాముల క్యాబేజీలో 24 క్యాలరీలు ఉంటాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో క్యాబేజీ కీ రోల్ పోషిస్తుంది. ఇందులో ఫైబర్‌తోపాటు వాటర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. దీనిని తరచుగా తినడంవల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువ సేపు ఉంటుంది. జంక్ ఫుడ్ వంటివి తినడానికి ఆసక్తి చూపరు. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతోపాటు అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది.

మెంతికూర

మెంతి కూర అన్ని సీజన్లలో అందుబాటులో ఉంటుంది. ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. అధిక బరువుతో ఇబ్బంది పడేవారు తమ డైట్‌లో చేర్చుకోవడంవల్ల మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇందులో బరువును తగ్గించగల ఫైబర్‌ కంటెంట్ ఉంటుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలోనూ ఇది సహాయపడుతుంది. అతిగా తినే అలవాటును నిరోధిస్తుంది. ఇవన్నీ అధిక బరువు తగ్గడానికి సహాయపడతాయి.



Source link

Related posts

మైక్రో బ్రేక్ ట్రెండ్ గురించి విన్నారా?.. ఫాలో అయితే కలిగే ప్రయోజనాలివిగో..

Oknews

ఈ వ్యాధితో బాధపడుతున్నవారు బనానా చిప్స్‌ను తీసుకోకూడదు?

Oknews

అతని మ్యూజిక్ కి మనుషులే కాదు పక్షులు కూడా మెస్మరైజ్ కావాల్సిందే..

Oknews

Leave a Comment