ByGanesh
Thu 28th Sep 2023 08:15 AM
ఈరోజు థియేటర్స్ దగ్గర ఇంత సైలెంట్ వాతావరణం కనిపించేదా.. ప్రభాస్ ఫాన్స్ రచ్చ, ప్రభాస్ కటౌట్స్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్యాన్ ఇండియాలోని ప్రతి భాషలో ప్రభాస్ సలార్ సందడి కనిపించేది. సోషల్ మీడియాలో మొత్తం సలార్ జాతరని తలపించేది. సలార్ టాక్, సలార్ ఓవర్సీస్ పబ్లిక్ టాక్ అంటూ నానా రచ్చ చేసేవారు. సెప్టెంబర్ 28 న సలార్ వస్తుంది అంటూ మేకర్స్ పదే పదే ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు.
కానీ కొన్ని కారణాల వలన సలార్ ని వాయిదా వేశారు. లేదంటే సెప్టెంబర్ 28 అంటే ఈరోజు థియేటర్స్ దగ్గర టపాసులు కాలుస్తూ, పేపర్స్ చింపుతూ ప్రభాస్ ఫాన్స్ ప్రభాస్ కటౌట్స్ కి పాలాభిషేకాలు చేసేవారు. ప్రభాస్ అభిమానుల రచ్చకి సోషల్ మీడియా షేకయ్యదే, సలార్ పబ్లిక్ టాక్, ఓవర్సీస్ ప్రీమియర్స్, సలార్ ప్రీమియర్స్ షోస్, సలార్ రివ్యూస్ అబ్బో హంగామా సౌత్ నుంచి నార్త్ వరకు టాప్ లేచిపోయేది.
నిజంగా ఈరోజు ఇంత సైలెంట్ గా ఖచ్చితంగా ఉండేది కాదు. సలార్ రిలీజ్ డేట్ మారడంతో అభిమానులు బాగా డిస్పాయింట్ అవుతున్నారు. మరోపక్క సలార్ మేకర్స్ పై ఇండస్ట్రీ జనాలు చెప్పుకోలేని ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. కొత్త డేట్ లాక్ చెయ్యకుండా కన్ఫ్యూజ్ చేస్తూ కొన్ని సినిమాల విడుదలకు ఇబ్బందిగా మారడంతో వారు లోలోపల టెన్షన్ పడుతున్నారు. మరి ఈరోజు జరగాల్సిన సలార్ జాతర ఎప్పుడు మొదలవుతుందో.. డిసెంబర్ 22 అంటున్నారు.. అదేదో మేకర్స్ ప్రకటించేవరకు వెయిట్ చెయ్యాల్సిందే మరి.
Salaar: Was it so silent today?:
Salaar release on dec 22nd