Health Care

ఈ అలవాట్లతో విజయం మీ సొంతం..


దిశ, ఫీచర్స్ : ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు విజయం సాధించాలని కోరుకునే వారు. ఆ కోరిక ఉంటే సరిపోదు, అనుకున్న గమ్యం చేరాలంటే పట్టుదలతో కష్టపడాలి. విజయం మనల్ని జీవితంలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది, అదే వైఫల్యం మనల్ని అంధకారంలో పడేలా చేస్తుంది. కానీ వైఫల్యం జీవితంలో అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఇది మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది.

జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయానన్న బాధ ఎప్పుడూ ఉంటుంది. ఇది ఆత్మగౌరవాన్ని తగ్గించడమే కాకుండా కొన్నిసార్లు ముందుకు సాగాలనే కోరిక కూడా పోతుంది. అలా కాకుండా జీవితంలో మనం ఏ అలవాట్లు అలవర్చుకుంటాము, వైఫల్యాల నుంచి మనం ఏం నేర్చుకున్నామో తెలుసుకోవాలి. కొన్ని సార్లు ఓటమి విజయం వైపునకు తీసుకువెళుతుంది. అలాగే కొన్ని అలవాట్లు కూడా మనల్ని విజయపథం వైపునకు నడిపిస్తాయి. మరి విజయం వైపు తీసుకెళ్తున్న కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆత్మ విశ్వాసం..

మన విజయానికి ఆత్మవిశ్వాసం కూడా ముఖ్యం. ఆత్మవిశ్వాసం లేని వ్యక్తులు ఇతరులతో పోలిస్తే తమను తాము వెనుకబడినట్లుగా భావిస్తారు. అలాంటి వారు భయం కారణంగా రిస్క్ తీసుకోరు. అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అనేక అవకాశాలను కోల్పోతారు.

సమస్యల పై ఎక్కువ దృష్టి..

ఎల్లప్పుడూ పరిష్కారం పై దృష్టి పెట్టండి. కొంతమంది ఎప్పుడూ ఒకే సమస్యలో చిక్కుకుపోతుంటారు. దీంతో ఆయన ముందుకు వెళ్లలేకపోతున్నారు. వారు పరిష్కారాలను కనుగొనడం పై అస్సలు దృష్టి పెట్టరు. దాని కారణంగా వారు ముందుకు సాగలేరు.

ప్రతికూల ఆలోచన..

ప్రతికూల ఆలోచనలు ఉన్నవారు కూడా పెద్దగా పురోగతి సాధించలేరు. ప్రతికూల ఆలోచనలతో చుట్టుముట్టిన వ్యక్తులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. అలాంటి వ్యక్తులు సక్సెస్‌కి దగ్గరగా వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు ఫెయిల్ అవుతారు.



Source link

Related posts

మీ పిల్లల్లో ఈ 4 లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే దానికి సంకేతం!

Oknews

ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వంట.. ఆరోగ్యానికి మంచిదేనా?

Oknews

Mobile charging : డార్క్ మోడ్ పెట్టుకోవడం వలన మన మొబైల్ ఛార్జింగ్ సేవ్ అవుతుందా.. అందులో నిజం ఎంత ఉందంటే?

Oknews

Leave a Comment