దిశ, ఫీచర్స్ : మనం డైలీ వాడే బాల్ పాయింట్ పెన్ను ధర ఎంత ఉంటుంది? సాధారణంగా రూ. 5 నుంచి 50 లోపు ఉంటుంది. స్టైల్ అండ్ బ్రాండెడ్‌ను బట్టి అది ఎంత మంచి పెన్ను అయినా రూ. 1, 000 లోపు ఉంటుంది. అంతేకానీ ఏకంగా లక్షలాది రూపాయలు ధర పలికే పెన్ను గురించి మీరెప్పుడైనా విన్నారా? కానీ మోంట్ బ్లాంక్ అనే ఓ జర్మన్ లగ్జరీ బ్రాండ్ ఉత్పత్తుల సంస్థ అమ్మే ఒక పెన్ను ధర మాత్రం అలాగే ఉంది. 1906లో ఈ సంస్థను స్ధాపించబడిన ఈ సంస్థకు వెస్ట్రన్ ఆల్ప్స్‌లోని 4810 మీటర్ల ఎత్తైన స్ఫుటికాకార పర్వతమైన మోంట్ బ్లాంక్ వద్ద ఉన్నందుకు దీనికి ఆ పేరు వచ్చిందట.
ప్రజెంట్ మోంట్ బ్లాంక్ సంస్థ అదే పేరుతో ఒక పెన్నును అక్షరాల రూ. 10 లక్షలకు అమ్ముతోంది. పైగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెన్ను కూడా ఇదేనట. ఎందుకలా అంటే.. ఈ పెన్నులో ప్రత్యేక లక్షణాలు ఉన్నాయట. 4810 సంఖ్య, అలాగే రౌండ్ షేప్‌తో కూడిన అంచులతో తెల్లటి స్టైలిష్ పాయింటెడ్ స్నో ఫ్లేక్ ట్రేడ్ మార్క్ ఉన్నాయి. దానిపై తయారు చేసిన స్టేటస్ సింబల్, ఆర్ట్‌వర్క్, డిజైన్ ఆకట్టుకుంటాయి. మరో విషయం ఏంటంటే.. ఈ పెన్నులోని నిబ్ భాగం 14 క్యారెట్ల గోల్డ్‌తో తయారు చేశారు. పైగా వారు తయారు చేసే ప్రతీ పెన్ను క్రమ సంఖ్యతో స్టార్ట్ అవుతుందట. ప్రజెంట్ మోంట్ బ్లాంక్ పెన్ను మార్కెట్ ధర రూ. 10 లక్షలు ఉండగా, చాలామంది దానిని ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కోసం కొనుగోలు చేస్తుంటారట.