దిశ, ఫీచర్స్ : నగరాల్లో నివసించే చాలా మంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతూ ఉంటారు. పెరిగిన బరువు నేటి కాలంలోని ప్రధాన సమస్యలలో ఒకటి. ఒక నివేదిక ప్రకారం ప్రతి నాల్గవ వ్యక్తి ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. మీరు అధిక బరువుతో ఉంటే, మీరు ఇతర వ్యాధుల బారినపడే ప్రమాదం కూడా ఉందని అర్థం. అయితే బరువు తగ్గించుకునేందుకు ఎన్నో రకాల పద్దతులను అవలంభిస్తున్నారు ప్రజలు. కానీ అన్ని పద్దతులు అందరికీ సరిపోదు. ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఓ చర్చ ప్రజల్లో ముందుకొస్తుంది. మరి ఇప్పుడు ఆ చర్చ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాఫీ తాగితే స్ట్రెస్ పోతుంది అని చాలా మందికి తెలుసు. అయితే కాఫీ తాగితే కొవ్వు కూడా తగ్గుతుందని మీకు తెలిసి ఉండదు. మితంగా కాఫీ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి మీరు మీ కాఫీలో వెన్నను జోడిస్తే కొవ్వు మైనంలా కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గడానికి ఈ రెసిపీని కేక్స్, పేస్ట్రీలలో ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. కాఫీ నుండి బరువు తగ్గడానికి మీరు దానికి వెన్నని జోడించాలి. ఇది అనేక విధాలుగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది విదేశాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా ఈ పద్దతిని అవలంభిస్తున్నారట. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆంగ్ల వెబ్‌సైట్ ప్రకారం దాని ప్రయోజనాల్లో మొదటిది వెన్న అన్ని అవసరమైన విటమిన్‌లను కలిగి ఉంటుంది. కాల్షియం జీవక్రియ కోసం విటమిన్ K2 కూడా కలిగి ఉంటుంది.
ఇవన్నీ బరువు తగ్గించడంలో బాగా సహాయపడతాయి. ఇప్పుడు మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే, మీరు నాణ్యమైన వెన్న, ఫిల్టర్ కాఫీని ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే దానికి పాలు జోడించడం, జోడించక పోవడం మీ ఇష్టం.