మరోవైపు హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మహా దర్శన్ పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్ వంటి అధ్యాత్మిక ప్రాంతాలను చూడొచ్చు. MADHYA PRADESH MAHA DARSHAN పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో… పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. ఉజ్జయిని, ఓంకారేశ్వర్, భోపాల్, సాంచితో పాటు ప్రాంతాలు కవర్ అవుతాయి.4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 28,2024 తేదీన అందుబాటులో ఉంది.