Health Care

ఈ పండ్ల తొక్కలతో పాదాలకు మెరుపు..


దిశ, ఫీచర్స్ : చాలామంది తమ ముఖాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ముఖం అందంగా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు. కాస్మొటిక్స్ వాడడం, ఫేషియల్ చేయించుకుంటారు. ముఖం వరకు సరే కానీ వారి పాదాలను మాత్రం పట్టించుకోరు. చాలా సార్లు పాదాలలో టానింగ్ సమస్య ఉంటుంది. దీని కారణంగా పాదాల చర్మం నల్లగా, నిర్జీవంగా మారడం ప్రారంభమవుతుంది. అప్పుడప్పుడు పెడిక్యూర్ చేయించుకున్నా మళ్లీ కొన్ని రోజులకు సేమ్ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు మీరు ఇంట్లోనే కొన్ని పండ్ల తొక్కలను ఉపయోగించవచ్చు. ఎందుకంటే పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పండ్ల పీల్స్ లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలా ఇళ్లలో పండ్ల తొక్కలు బయటపడేస్తూ ఉంటారు. అయితే చర్మ సంరక్షణలో పండ్ల తొక్కలను ఉపయోగించవచ్చు. అలాగే మీ పాదాలను కూడా అందంగా మార్చుకోవచ్చు. మరి ఆ రెమెడీలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటిపండు తొక్క..

అరటి తొక్క మంచి ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. పాదాల నల్లని చర్మాన్ని తెల్లగా మార్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పండిన అరటిపండు తొక్కను తీసుకుని దాని లోపలి భాగంలో బేకింగ్ సోడాను అప్లై చేసి పాదాలకు స్క్రబ్ చేయాలి. దీంతో డెడ్ స్కిన్ క్లియర్ అవుతుంది. దీని తర్వాత పాదాలను కొంత సమయం పాటు గోరువెచ్చని నీటిలో ఉంచి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా పాదాలు అందంగా కనిపిస్తాయి.

బొప్పాయి తొక్క..

బొప్పాయి తొక్క కూడా మీ పాదాలను మెరిసేలా చేస్తుంది. బొప్పాయి తొక్కలను తీసుకుని చిన్న ముక్కలుగా కోసి అందులో అలోవెరా జెల్, తేనె వేసి గ్రైండ్ చేస్తే మంచి పేస్ట్ తయారవుతుంది. ఈ పేస్ట్‌ను పాదాలకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే పాదాల చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా మృదువుగా చేస్తాయి.

నారింజ తొక్క..

నారింజ తొక్కతో ముఖం మాత్రమే కాదు పాదాలు కూడా అందంగా మారతాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చర్మపు రంగును క్లియర్ చేయడంలో, టానింగ్ వంటి సమస్యలను తొలగించడంలో ప్రభావం చూపిస్తుంది. నారింజ తొక్కలను ఎండబెట్టి గ్రైండ్ చేసి అందులో పచ్చి పాలు కలిపి పాదాలకు పట్టించాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. కాస్త ఆరిపోయాక మసాజ్ చేసి శుభ్రం చేసుకోవాలి. ఈ రెమెడీని వారానికి రెండు సార్లు చేయడం వల్ల పాదాల నల్లని చర్మం క్లియర్ అవుతుంది.



Source link

Related posts

మెదడుపై ప్రభావం చూపుతున్న హవానా సిండ్రోమ్.. బాధితుల్లో వీళ్లే ఎక్కువ..

Oknews

కృష్ణ పక్షం, శుక్ల పక్షం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా..

Oknews

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని మీ డైట్ లో చేర్చుకోవాలి

Oknews

Leave a Comment