దిశ, ఫీచర్స్: కొన్నిసార్లు మనుషుల కంటే పక్షులు, జంతువులు బెటర్ అని చెప్పుకుంటారు. ప్రస్తుత సమాజంలో పక్కకున్న వ్యక్తికి ఏం జరిగినా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా పట్టించుకోని రోజులివి. రోడ్లపై ఆక్సిడెంట్స్ జరిగినా, ఇరుగుపొరుగు వారు పలు గొడవల కారణంగా కొట్లాటకు దిగిన సినిమా చూస్తున్నట్లు చూస్తూ.. స్మార్ట్ ఫోన్లల్లో వీడియోలు తీస్తుంటారు. ఇలాంటి సమాజంలో తాజాగా కొన్ని పక్షులు చేసిన పనికి సోషల్ మీడియాలోని జనాలు ఆశ్చర్యపోతున్నారు.
సమ్‌టైమ్స్ పక్షులు చేసే పనులు చూస్తే.. కామెడీ గా అనిపిస్తుంది. కొన్నిసార్లు శభాష్ అనిపిస్తుంది. వివరాల్లోకెళ్తే.. ఓ వ్యక్తి పొలంలో గడ్డి కి నిప్పు పెట్టాడు. వెంటనే కొన్ని పక్షులు వచ్చి.. ఆ మంటలను ఆర్పేశాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొన్ని పక్షులు ఆహారం కోసం గడ్డిని వెతుకుతుంటాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి అక్కడికి వెళ్లి పక్షుల తెలివిని పరీక్షిస్తాడు. పక్షుల దగ్గరకు వెళ్లి గడ్డికి నిప్పంటిస్తాడు.
మంటలు మొదలవ్వగానే పక్షులు వెంటనే అక్కడికొచ్చి.. రెక్కలతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తాయి. ముక్కులతో పొడుస్తూ.. వాటి రెక్కలను మంటపై కప్పుతూ.. ఎన్నో రకాలుగా మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తాయి. నిజంగానే రైతులకు ఏమైనా నష్టం జరుగుతుందేమోనని భావించిన ఈ చిన్ని పక్షులు మంట వేడికి వాటి ముక్కులు కాలుతున్నా పట్టించుకోకుండా మంటను కంప్లీట్‌గా ఆర్పేస్తాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఈ రోజుల్లో కావాలని పంటకు నిప్పు పెట్టి నష్టం చేకూర్చే మనుషులున్నారు. కానీ ఈ పక్షుల తెలివికి నిజంగా రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి. ప్రాణాలు పోతాయని కాస్తైనా భయం లేకుండా అవి మంటలు ఆర్పాయి. నిజంగా హాట్సాప్. మనిషి మంచి, చెడు అనే జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్న ఈ రోజుల్లో జంతువులు, పక్షులను చూసి నేర్చుకోమంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు 25 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
They’re much smarter than most people.pic.twitter.com/QxXVG8XVlC
— Figen (@TheFigen_) February 2, 2024