Health Care

ఈ పానీయాలు తాగుతున్నారా.. అయితే గుండె జబ్బులకు వెల్‌కమ్ చెప్పినట్టే..!


దిశ, ఫీచర్స్: సాధారణంగా మనమందరం పానీయాలు తాగుతూ ఉంటాము. వాటిలో ఫ్రూట్ జ్యూస్ అని, కూల్ డ్రింక్స్ అని లాగిస్తూ ఉంటాము. కానీ వీటివల్ల కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయనే విషయం మనలో చాలా మందికి తెలియదు. అలాగే కొంతమంది తెలిసి కూడా లైట్ తీసుకొని తాగుతున్నారు.

నేటి కాలంలో వయసు అయిపోయిన వారి కంటే ఎక్కువగా యువతనే అనేక రకాల గుండె జబ్బుల బారిన పడుతున్నారు. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవనశైలిలో అధిక శ్రద్ధ తీసుకోవడం ఇంపార్టెంట్ . ముఖ్యంగా పలు రకాల పానీయాలు గుండె ఆరోగ్యాన్ని నేరుగా దెబ్బతీస్తాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

బయట దొరికే ఫ్రూట్ జ్యూస్‌లు:

బేసిక్‌గా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ మీరు ప్యాక్ చేసిన పండ్ల రసాన్ని తాగితే మాత్రం ప్రమాదంలో పడ్డట్టే. హెల్త్‌కి మంచిదని చాలా మంది ఫ్రూట్స్ జ్యూస్ కొని తాగుతుంటారు. ఈ తప్పు చేయవద్దు. ఎందుకంటే ప్యాక్ చేసిన పండ్ల రసాలలో చక్కెర అధికంగా ఉండటంతోపాటు ప్రిజర్వేటివ్‌లు కూడా ఉంటాయి. అవి ఆరోగ్యానికి హానికరం. అందుకే ఇంట్లోనే పండ్ల రసాన్ని తయారు చేసుకోవడం చాలా బెస్ట్.

ఎనర్జీ డ్రింక్స్:

ప్రస్తుత కాలంలో మార్కెట్లో వివిధ రకాల ఎనర్జీ డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి. కొందరైతే తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయని, వాటిలో చక్కెర ఉండదని భావించి తాగుతూ ఉంటారు. కానీ, ఇది అబద్ధం. ఎనర్జీ డ్రింక్స్ ఎప్పుడు హెల్తీవి కావు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలేవీ ఉండవు. అలాగే శీతల పానీయాలు రుచికి మంచిగ అనిపించేంత హెల్త్‌కి మంచిది కాదు. వీటిని తాగడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్‌ను పెరిగి అది మన హార్ట్‌కు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మద్యం సేవించడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు పెరుగుతాయి. ఫ్యాటీ లివర్ సమస్యలు రావొచ్చు. కాబట్టి వీటికి దూరంగా ఉండీ మీ గుండెను పది కాలాల పాటు పదిలంగా ఉంచుకోండి.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.



Source link

Related posts

లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పండును తీసుకోండి!

Oknews

బెస్ట్ ఫ్రెండ్స్‌తో ఈ విషయాలు పంచుకుంటున్నారా? బీ కేర్ ఫుల్..!!

Oknews

మీకు తెలుసా.. వరల్డ్ వైడ్ వెబ్(WWW) పుట్టింది నేడే

Oknews

Leave a Comment