Jagan Photo On E Pass Book : ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సాధారణంగా ప్రభుత్వం మారితే పథకాల పేర్లు, ప్రభుత్వ వెబ్ సైట్లలో ఫొటోలు మారతాయి. ఇది సర్వసాధారణం. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత… ప్రభుత్వ వెబ్ సైట్ లలో గత ప్రభుత్వ తాలుకా ఫొటోలు, ఓ పార్టీకి సంబంధించిన రంగులు తొలగించాలని ఆదేశించింది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్టిఫికెట్లను ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మాట్ లో అందించాలని, గత ప్రభుత్వంలో నిర్దేశించినవి వినియోగించవద్దని తెలిపింది.