Andhra Pradesh

ఈ ఫిబ్రవరిలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు ఇవే-the details of the special festivals to be celebrated in the month of february in tirumala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న స‌నాత‌న‌ ధార్మిక సదస్సుకు ముమ్మ‌రంగా ఏర్పాట్లు చేయాలని ఈవో ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తి టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో మంగ‌ళ‌వారం ఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ…. తిరుమల ఆస్థాన మండపంలో మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న స‌నాత‌న‌ ధార్మిక సదస్సులో దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామిజీలు పాల్గొంటార‌న్నారు. సదస్సుకు విచ్చేసే స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప‌టిష్ట‌మైన ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డానికి ముగ్గురు సీనియ‌ర్ అధికారుల‌తో కూడిన స‌మ‌న్వ‌య క‌మిటీని ఏర్పాటు చేసి, వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులను సంప్ర‌దించాల‌న్నారు. అదేవిధంగా ప్ర‌తి స్వామిజీకి ఒక లైజ‌న్ అధికారిని నియ‌మించాల‌న్నారు. స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాటు చేసిన దర్శనం, వసతి, ఆహార, ర‌వాణా త‌దిత‌ర కమిటీల‌తో లైజ‌న్ అధికారి స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు.



Source link

Related posts

Alla Ramakrishna Reddy Joins Ysrcp : షర్మిలకు హ్యాండిచ్చిన ఎమ్మెల్యే ఆర్కే, తిరిగి సొంతగూటికి!

Oknews

ఇది పెద్దిరెడ్డి అడ్డా, టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించిన వైసీపీ నేత-punganur ysrcp leader abused took off the shirts of tdp workers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

మంత్రి రోజాకు మద్దతుగా నిలిచిన ఎంపీ నవనీత్ కౌర్, బండారు వ్యాఖ్యలపై ఆగ్రహం!-maharashtra mp navneet kaur fires on tdp leader bandaru satyanarayana objectionable comments on rk roja ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment