EntertainmentLatest News

ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ ని గుర్తుపట్టారా..?


ఒకే రంగంలో ఎదగడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఉండటం గొప్ప కాదు. ఎదిగిన తరువాత కూడా వారి మధ్య అదే స్నేహం కొనసాగడం గొప్ప. హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ది అలాంటి గొప్ప స్నేహమే. 

విజయ్, నాగ్ అశ్విన్ ఇంచుమించు ఒకే సమయంలో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాంతో వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పుడు సినీ ఫీల్డ్ లో ఇద్దరూ సక్సెస్ అయ్యారు. ఒకరి సక్సెస్ ని చూసి ఒకరు మురిసిపోతున్నారు. వీరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో..  గతంలో నాగ్ అశ్విన్ చెప్పిన మాటని బట్టి అర్థం చేసుకోవచ్చు. తాను చేసే ప్రతి సినిమాలో విజయ్ ఉంటాడని అన్నాడు. అన్నట్టుగానే ఇప్పటిదాకా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన మూడు సినిమాల్లో విజయ్ ఉన్నాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ సినిమాల్లో కథకి కీలకమైన పాత్రలు విజయ్ పోషించాడు. ఇక రీసెంట్ గా వచ్చిన ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD)లో అర్జునుడి పాత్రలో విజయ్ కనిపించడం విశేషం. ప్రస్తుతం ‘కల్కి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో విజయ్, నాగ్ అశ్విన్ ఓల్డ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో విజయ్ చాలా యంగ్ గా మెరిసిపోతుండగా.. నాగ్ అశ్విన్ ఇప్పటికంటే బక్కగా, లాంగ్ హెయిర్ స్టైల్ తో ఉన్నాడు. ఇది కొన్నేళ్ల క్రితం ఓ ప్రైవేట్ పార్టీలో దిగిన ఫొటో. అప్పుడు ఆ ఫొటోలో ఉన్న కుర్రాళ్లే.. ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్స్ గా ఎదిగారు.



Source link

Related posts

Khammam Lok Sabha Constituency In News హాట్ టాపిక్‌గా ఖమ్మం పార్లమెంట్

Oknews

డబుల్ ఇస్మార్ట్ ఫ్లాష్ బ్యాక్ పై క్రేజీ న్యూస్

Oknews

రేణుక స్వామిని నా అన్నయ్య దర్శన్ హత్య చేయించలేదంటున్న నాగ శౌర్య  

Oknews

Leave a Comment