ఈ బాలీవుడ్ కు ఏమైంది.. బన్నీ విస్మయం Great Andhra


కొన్నేళ్లుగా బాలీవుడ్ పై సౌత్ సినిమాలు పూర్తి ఆధిపత్యం చలాయిస్తున్నాయి. మధ్యలో యానిమల్, గదర్, జవాన్ లాంటి సినిమాలు హిట్టయినప్పటికీ.. సౌత్ డామినేషన్ మాత్రం తగ్గలేదు. రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్టవ్వడం, అదే టైమ్ లో అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరోలు నటించిన సినిమాలు దారుణంగా ఫ్లాప్ అవ్వడంతో, ఈ చర్చ మరోసారి మొదలైంది.

ఇప్పుడీ చర్చను మరో మలుపు తిప్పాడు దర్శకుడు నిఖిల్ అద్వానీ. బాలీవుడ్ ప్రస్తుత స్థితిపై అల్లు అర్జున్ తనతో మాట్లాడిన మాటల్ని బయటపెట్టాడు.

బాలీవుడ్ మేకర్స్ హీరోయిజం చూపించడం మరిచిపోయారన్నది అల్లు అర్జున్ అభిప్రాయం. హీరోలను ఎలా చూపించాలో బాలీవుడ్ మేకర్స్ కు బాగా తెలుసని, కానీ ఆ విషయాన్ని మరిచిపోయారని బన్నీ అన్నాడట.

ఈ విషయాన్ని నిఖిల్ కూడా అంగీకరించాడు. సౌత్ సినిమాల్లో హీరోయిజంతో పాటు బలమైన ఎమోషన్స్ చూపిస్తున్నారని.. ఈ విషయంలో బాలీవుడ్ వెనకబడిందని ఒప్పుకున్నాడు. బాలీవుడ్ లో ఒకప్పుడు అలాంటి సినిమాలు వచ్చాయన్న నిఖిల్.. అమితాబ్ నటించిన కొన్ని సినిమాల్ని ప్రస్తావించాడు. లార్జర్ దేన్ లైఫ్ పాత్రలు పోషించి అందర్నీ అలరించారని అన్నాడు.

పుష్పతో పాన్ ఇండియా హీరోగా అవతరించిన అల్లు అర్జున్.. బాలీవుడ్ పై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని ఎప్పుడూ చాటుకుంటూనే ఉన్నాడు. ఈమధ్య కాలంలో బాలీవుడ్ కొన్ని సవాళ్లను, ప్రతికూలతలను ఎదుర్కొన్నప్పటికీ.. సౌత్ సినిమాపై బాలీవుడ్ ప్రభావం ఉందని బన్నీ అంగీకరించాడు.



Source link

Leave a Comment