Health Care

ఈ బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 43,8000 గంటలు పనిచేస్తుందట..


దిశ, ఫీచర్స్ : మొబైల్ బ్యాటరీని ఫుల్ చేస్తే ఒక రోజు లేదా కొన్ని గంటలు మాత్రమే ఉపయోగంలో ఉంటుంది. కానీ ఓ బ్యాటరీని ఫుల్ చార్జ్ చేస్తే కొన్నాళ్ల పాటు అలాగే ఉంటుందని మీలో ఎవరికైనా తెలుసా. ఇంతకీ ఆ బ్యాటరీ దేనికి వినియోగిస్తారు, దాన్ని ఎవరు తయారు చేస్తారన్న విషయం కూడా చాలా మందికి తెలిసి ఉండదు. అయితే ఇప్పుడు ఈ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొంతకాలం క్రితం చైనీస్ కంపెనీ బీటావోల్ట్ ఓ అద్భుతమైన బ్యాటరీని తయారు చేసింది. ఈ బ్యాటరీ కొన్ని రోజులు లేదా నెలలు కాదు ఏకంగా 50 సంవత్సరాల పాటు (సుమారు 43,8000 గంటలు) పనిచేస్తుందట. 50 ఏండ్లు పనిచేస్తుంది అటే బ్యాటరీ పరిమాణం చాలా పెద్దదిగా ఉంటుందని అనుకోవచ్చు. కానీ చైనీస్ కంపెనీ బీటావోల్ట్ ఈ బ్యాటరీ పరిమాణాన్ని నాణేనికి సమానంగా తయారు చేసింది. ఈ బ్యాటరీ ప్రస్తుతం పైలట్ టెస్టింగ్ దశలో ఉంది.

బ్యాటరీ లక్షణాలు ఏమిటి..

చైనీస్ కంపెనీ అభివృద్ధి చేసిన ఈ బ్యాటరీకి ఛార్జింగ్ లేదా మెయింటనెన్స్ అవసరం లేదట. ఈ బ్యాటరీ అణుశక్తితో నడుస్తుందట. ఈ బ్యాటరీని డ్రోన్లు, ఫోన్‌లతో సహా అనేక పరికరాలకు ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు కొన్ని బ్యాటరీలలో వచ్చినట్టుగా ఈ బ్యాటరీలో మంటలు రావని, ఇది పేలిపోదని కంపెనీ పేర్కొంది. ఈ బ్యాటరీని వివిధ ఉష్ణోగ్రతల వద్ద పరీక్షించారని తెలిపారు.

బ్యాటరీ ఎలా పని చేస్తుంది ?

ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం, ఈ బ్యాటరీ ఐసోటోపుల నుండి విడుదలయ్యే శక్తిని విద్యుత్తుగా మార్చడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఈ బ్యాటరీ ధర కూడా కాస్త ఎక్కువే.

ఈ బ్యాటరీని వేటిలో ఉపయోగిస్తారు ?

బీటావోల్ట్ తయారు చేసిన ఈ న్యూక్లియర్ ఎనర్జీ బ్యాటరీని AI పరికరాలు, ఏరోస్పేస్, హైటెక్ సెన్సార్లు, వైద్య పరికరాలు, మైక్రోప్రాసెసర్‌లు, చిన్న డ్రోన్‌లు, మైక్రోబోట్‌లలో ఉపయోగించవచ్చు.



Source link

Related posts

ఉదయాన్నే లేచి ఆ పనిచేసే అలవాటు.. బెనిఫిట్స్ తెలిస్తే మీరు కూడా..

Oknews

చిన్నారి ప్రాణాలతో చెలగాటం.. బైక్‌పై కూర్చోబెట్టుకొని ప్రమాదకర విన్యాసాలు

Oknews

రాత్రంతా ఫుల్లుగా ఏసీ ఆన్‌చేసి పడుకుంటున్నారా?.. ఇది తెలిస్తే షాక్ అవుతారు !

Oknews

Leave a Comment