మేము సినిమాలే కాదు బిజినెస్ లు కూడా చేస్తామని గతంలో చాలా మంది నటీమణులు నిరూపించారు. పైగా సక్సెస్ కూడా అయ్యారు. ఇప్పుడు ఈ కోవలోకి ప్రముఖ సీనియర్ నటి ఉదయభాను(udaya bhanu) చేరింది. పైగా తన జీవిత లక్ష్యం నెరవేరిందని కూడా చెప్తుంది. ఇంతకీ తను ప్రారంభించిన బిజినెస్ ఏంటో చూద్దాం.
ఉదయభాను bhuyav .com (bhuyav.com) పేరుతో ఒక స్టోర్ ని ప్రారంభించింది. ఇందులో రకరకాల క్లాతింగ్స్ తో పాటు జ్యువెలరీ, ఫ్యాషన్ అక్ససిరిస్ అందుబాటులో ఉండబోతున్నాయి. ఈ విషయాన్ని ఇనిస్ట్రాగ్రమ్ వేదికగా వెల్లడి చేసింది.ఈ రోజు నా కల నెరవేరింది. ఎంతో కాలంగా ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. ఇది నా డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పింది.అలాగే ఈ స్టోర్ లో రాబోయే రోజుల్లో మరిన్ని రూపాలు సంతరించుకుంటుందని కూడా చెప్పింది. అందరు సైట్ విజిట్ చేసి తనని ఎంకరేజ్ చెయ్యాలని కోరింది. చాలా మంది ఆమె చేసిన విజ్ఞప్తికి పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అలాగే ఇన్నాళ్లు నటిగా తనని ఎంకరేజ్ చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలిపింది.
1994 లో వచ్చిన ఎర్రసైన్యం సినిమా ద్వారా ఉదయభాను తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ప్రాధాన్యమున్న పాత్రలని పోషించింది. టెలివిజన్ హోస్ట్ గాను ఎన్నో కార్యక్రమాలకి హోస్ట్ గాను చేసింది.సామజిక సమస్యల పై కూడా తనదైన రీతిలో స్పందిస్తుంది. కాకపోతే ఆమె సినీ కెరీర్ అనుకున్నంతగా ముందుకు సాగలేదు. ఈ విషయాన్నీ ఆమె చాలా సార్లు ఒప్పుకుంది.