సమ్మర్ వచ్చేసింది, తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్నాయి. సాధారణంగా సమ్మర్ సీజన్‌లో స్టార్ హీరోల సినిమాలు వరుస కడతాయి. సంక్రాంతి తర్వాత ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది. కానీ, మీడియం బడ్జెట్ లో తెరకెక్కిన సినిమాలు ప్రతీవారం బాక్సాఫీసు ముందు దండయాత్ర చేస్తూనే ఉన్నాయి. ఈవారం ఏకంగా 7 సినిమాలు విడుదల కాబోతున్నాయి. అన్నీ చిన్న సినిమాలే.
అందులో పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ చాలాకాలం తరవాత వేయ్.. దరువేయ్ చిత్రంతో మార్చ్ 15 కి రాబోతున్నాడు. బాబీ సింహా, అనసూయ, అనన్య పాండే ప్రధాన పాత్రలు పోషించిన రాజాకార్ కూడా ఈవారంలోనే విడుదల అవుతోంది. వీటితో పాటు లంబసింగి, లైన్ మ్యాన్, తంత్ర, రవికుల రఘురామా, షరతులు వర్తిస్తాయి వంటి చిత్రాలు ఈవారమే విడుదల కాబోతున్నాయి.
ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాల హవా కొనసాగుతుండగా.. ఓటీటీలో కూడా సూపర్ హిట్ చిత్రాలు రాబోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. చాలా చిత్రాలు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యాయి.
ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, సిరీసుల లిస్ట్ ఇదే..
నెట్ ఫ్లిక్స్
యంగ్ రాయల్స్ సీజన్ 3 మార్చి 11న స్ట్రీమింగ్
మర్డర్ ముబారక్ (హిందీ మూవీ) – మార్చి 15న స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్
లవ్ అదురా (హిందీ వెబ్ సిరీస్) – మార్చి 13న స్ట్రీమింగ్
బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ వెబ్ సిరీస్) – మార్చి 14న స్ట్రీమింగ్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
సేవ్ ద టైగర్స్ సీజన్ 2 (తెలుగు వెబ్ సిరీస్) – మార్చి 15న స్ట్రీమింగ్
జీ5
మెయిన్ అటల్ హూ (హిందీ సినిమా) – మార్చి 14న స్ట్రీమింగ్
సోనీ లివ్
మమ్ముట్టి భ్రమయుగం (తెలుగు డబ్బింగ్ మూవీ) – మార్చి 15న స్ట్రీమింగ్
జియో సినిమా
హనుమాన్ (హిందీ వెర్షన్) – మార్చి 16న స్ట్రీమింగ్