Health Care

ఈ విధమైన గుండె నొప్పిని అస్సలు నమ్మకండి..చాలా డేంజర్?


దిశ,వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. హార్ట్ ఎటాక్ అంటే చాలు పెద్దవారిలో కనిపించే సమస్యగా తెలుసు కానీ ప్రజెంట్ జనరేషన్‌లో చిన్న పెద్ద తేడా లేకుండా హార్ట్ ఎటాక్ వస్తుంది. ఈ గుండె నొప్పి సమస్య ఎప్పుడు ఎటు నుంచి అటాక్ చేస్తోందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గుండె పోటు లక్షణాలు చాలా రకాలుగా ఉంటాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతి అని వైద్యులు చెబుతున్నారు.

కొందరు నిద్రించే సమయంలో విపరీతమైన సౌండ్ చేస్తుంటారు. అంటే గురక పెడుతుంటారు. ఇది కూడా గుండె పోటుకు లక్షణంగా చెప్పవచ్చు. చాలా మందికి గుండెపోటు వచ్చే ముందు ఉండే నొప్పికి సాధారణ నొప్పికి తేడా తెలియదు. దీంతో కొంతమంది నొప్పి వచ్చిన లైట్‌గా తీసుకొని ఆ టైంలో నొప్పిని తగ్గించుకోవడానికి ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటారు. ఇలాంటి వారికి హర్ట్ ఎటాక్ వచ్చి సడెన్‌గా చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలిపారు.

ఈ రకమైన నొప్పిని అస్సలు నమ్మకండి..?

ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..ఛాతీలో తీవ్రంగా నొప్పి వస్తుంటే మాత్రం కచ్చితంగా నిర్లక్ష్యం చేయొద్దని తెలిపారు. ఆ నొప్పి మెడ, దవడకు, తర్వాత వెనుకకు లేదా కిందకి, ఒకటి లేదా రెండు చేతులకు వ్యాపిస్తుంది. అప్పుడు అస్సలు నిర్లక్ష్యం చేయరాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ నొప్పి గుండె సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది. ఛాతి నొప్పి వచ్చే సమయంలో వికారం వాంతులు అయినా, చల్లని చెమటలు వచ్చిన వాటిని అస్సలు లైట్ తీసుకోవద్దు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినప్పుడు కూడా వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి. గుండె వేగంగా కొట్టుకుంటే కూడా అది తీవ్రమైన గుండె నొప్పికి దారి తీస్తుంది. మైకము లేదా బలహీనత గా ఉన్నా కూడా వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.



Source link

Related posts

హైపర్‌పిగ్మెంటేషన్‌తో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే చాలు చర్మం తెల్లగా మారుతుంది..

Oknews

సీతారాముడు విడిపోవడానికి కారణం చిలుకనా? | Sitaramulu was separated because of the parrot

Oknews

మీకు కాబోయే భాగస్వామిలో ఈ లక్షణాలను గమనించారా.. పెళ్లి చేసుకోవడం మానేయండి !

Oknews

Leave a Comment