దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆధునిక ప్రపంచం ఎంతో మారిపోయింది. చాలా మంది ఇక్కడ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడమే కాకుండా, ఆసక్తి ఉన్న విషయాలను పంచుకుంటున్నారు. తమలో ఉన్న టాలెంట్‌ను ప్రదర్శిస్తూ, రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. దీంతో ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో చెప్పలేని పరిస్థితి. ప్రజెంట్ ఇన్‌స్టా గ్రామ్, ఎక్స్(ట్విట్టర్), ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను చిన్నా పెద్దా, పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మారిపోతున్నాయి.
సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని ఓవర్‌నైట్ స్టార్లు అయిన వారు చాలామందే ఉన్నారు. ఇక్కడ మంచి ఫేమ్ సంపాదించుకోగానే ఎన్నో అవకాశాలు తలుపులు తడుతున్నాయి. డ్యాన్స్, యాక్టింగ్, సాంగ్స్, వంటలు, ట్రావెలింగ్, గేమ్స్, కెరీర్, ఫ్యాషన్ ఇలా అనేక రంగాల్లో ప్రూవ్ చేసుకుంటున్నారు. ఉదాహరణకు బర్రెలక్క, కుమారీ ఆంటీ వంటివాళ్లు సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలు అయిపోయారు. గత సంవత్సరం కచ్చా బాదం అనే పాటతో వెస్ట్ బెంగాల్ చెందిన ఒక వ్యక్తి ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క పాటతో రీల్ చేసి, వేరుశనక్కాయలు అమ్ముకునే ఒక కామన్‌మెన్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. దెబ్బకు పేదరికంపోయి అతను ఆర్థికంగా స్థిరపడ్డాడు. సోషల్ మీడియా పవర్ అంటే ఇలా ఉంటుంది మరి.
రీసెంట్‌గా ఇన్‌స్టా గ్రామ్‌లో మరో ఇంట్రెస్టింగ్ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది.‘‘రాజావిన్ పార్వయ్ రాణియన్ పక్కమ్’’ అనే పాటతో ఎంతోమంది వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇదే మ్యూజిక్ బ్యాగ్రౌండ్‌తో ఓ సాధారణ మహిళ రోడ్డుపై నడుస్తూ చేసిన డ్యాన్స్ ఇప్పుడు చాలామందిని అట్రాక్ట్ చేస్తోంది. పాటకు తగినట్లుగా ఆమె వేసిన స్టెప్పులు, హావ భావాలు చూసి అందరూ ఆమె టాలెంట్‌ను మెచ్చుకుంటున్నారు. ఓ వ్యక్తి దీనిని ఇన్‌స్టాలో షేర్ చేయగా 20 మిలియన్ల మంది వీక్షించారు. 1.60 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఇది చూసిన నెటిజన్లు, సోషల్ మీడియా యూజర్లు ‘‘ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబు’’ అంటూ కామెంట్ చేస్తుండగా, మరి కొందరు టాలెంట్ ఎవరి సొత్తూ కాదంటూ స్పందిస్తున్నారు.