ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఒంగోలు కి సినిమా పరిశ్రమకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఐదు దశాబ్దాల క్రితం నుంచే ఒంగోలు ప్రాంతానికి చెందిన ఎంతో మంది కళాకారులు సినిమా కళామా తల్లి ఒడిలో ముద్దుబిడ్డలుగా ఉన్నారు. టి.కృష్ణ పోకూరి బాబురావు ,బి.గోపాల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, గోపీచంద్, రామ్ లక్ష్మణ్,గోపిచంద్ మలినేని, ఎంవిఎస్ హరినాధ రావు లాంటి హేమాహేమీలు ఈ ప్రాంతం నుంచే వచ్చారు. తాజాగా ఒంగోలు కి చెందిన ముద్దుగుమ్మ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
యష్ పూరి హీరోగా తెరకెక్కిన చిత్రం హ్యాపీ ఎండింగ్. ఈ చిత్రంలో కథానాయికగా అపూర్వ రావు చేస్తుంది.ఈమె నేటివ్ ప్లేస్ ఒంగోలు. తన తండ్రి ఉద్యోగ రీత్యా అపూర్వ రావు ఫ్యామిలీ మొత్తం గుజరాత్ లో సెటిల్ అయ్యింది.ఆ తర్వాత ఆమె చైల్డ్ హుడ్ అంతా గుజరాత్ తో పాటు కువైట్ లో జరిగింది. ఆ తర్వాత ఇండియాకి తిరిగొచ్చిన అపూర్వ రావు గ్రాడ్యుయేట్ ని పూర్తి చేసింది. అనంతరం తన ఇంట్లో వాళ్ళకి సినిమాలంటే ఇష్టం లేక పోయినా కూడా నటి కావాలనే పట్టుదలతో హైదరాబాద్ లో ఉన్న యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంది. ఇప్పుడు హ్యాపీ ఎండింగ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
పిబ్రవరి 2 న విడుదల అవుతున్న హ్యాపీ ఎండింగ్ మూవీ మీద అపూర్వ రావు పూర్తి నమ్మకంతో ఉంది.ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె సినిమా గురించి చాలా విషయాలని ప్రేక్షకులతో పంచుకుంది. రేపు థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ప్రతి పది నిమిషాలకి ఒక సారి నవ్వుకుంటాడని ప్రస్తుతం బయట సినిమా గురించి ఎలాంటి హాడావిడీ లేకపోయినా రేపు రిలీజ్ అయ్యాక మాత్రం అందరు మా సినిమా గురించి చెప్పుకుంటారని కూడా ఆమె అంది . అలాగే మూవీలోని పాయింట్ చాలా కొత్తగా ఉంటుందని తప్పకుండా ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరిస్తారని కూడా ఆమె తన ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.