Health Care

ఉగాది పచ్చడి ఇలా చేశారంటే మీ ఇంట్లో సిరి సంపదలు నాట్యం చేస్తాయి..


దిశ, ఫీచర్స్: ఉగాది.. యుగాది.. తెలుగు ప్రజల నూతన సంవత్సర వేడుక. శుక్ల పాడ్యమి రోజున ప్రారంభమయ్యే సృష్ఠి నిర్మాణం. చిగురించిన చెట్లు, కోయిల కూతలు ఈ ఋతువు ప్రత్యేకత. కాగా షడ్రుచులతో కూడిన పచ్చడిని తయారు చేసి.. జీవితానికి చిహ్నంగా గుర్తించడం, దేవుడికి సమర్పించి అన్ని సమయాల్లోనూ తమకు పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని పూజించడం జరుగుతుంది. అయితే ఈ పచ్చడిని ఎలా చేస్తే మన ఇంట్లో సిరి సంపదలు వెల్లి విరుస్తాయో చూద్దాం.

పూర్వకాలం కుమ్మరి ఇంటికి వెళ్ళి కొత్త కుండను కొనడం ఆనవాయితీగా వచ్చేది. దాన్ని ఇంటికి తీసుకువచ్చి మామిడి తోరణాలు చుట్టి పసుపు కుంకుమతో ముస్తాబు చేసేవారు. ఆ తర్వాత కొత్త చింత పండును అందులో నాన బెట్టి కాస్త బెల్లం కలిపే వారు.

వేప పూత, మామిడి ముక్కలు, కాసింత ఉప్పు, కారం జోడించేవారు. తర్వాత ఈ పచ్చడిని మోదుగాకు డొప్పలో పోసి దేవుడికి నైవేద్యం పెట్టేవారు. శుభం జరగాలని కోరుకుంటారు. అనంతరం కుటుంబ సభ్యులు అందరూ దీన్ని సేవించి.. పెద్దల నుంచి చిన్న పిల్లలు ఆశీస్సులు తీసుకునేది. ఇక రైతులు పొలం దగ్గర నూతన కార్యక్రమాలకు నాంది పలుకుతారు. సాయంత్రం పూజారి దగ్గరకు వెళ్ళి పంచాంగం చూయించుకుని.. భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకునే వారు.



Source link

Related posts

ఎక్కువగా అద్ధం చూసుకోవడం రోగమా..! షాకింగ్ విషయాలు చెప్పిన నిపుణులు?

Oknews

హోలీ పండుగ రోజు ఇలా చేస్తే.. సంపద పెరుగుతోదంట!

Oknews

ఉగాది పంచాంగం : 12 రాశుల ఫలితాలు.. సంవత్సరంలో జరిగే విషయాలు తెలుసుకోండి!

Oknews

Leave a Comment