ప్రతీ సంవత్సరం కొన్ని వందల సినిమాలు రిలీజ్ అవుతాయి. అందులో యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, బయోగ్రాఫికల్, హారర్ జానర్ ఏదైన ప్రేక్షకులని మెప్పించాయా లేదా అనేదే ముఖ్యం. తాజాగా హిందీ భాషలో విడుదలైన మూవీ ’12th ఫెయిల్ ‘. బయోగ్రాఫికల్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకి తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ – 2024 లో ఉత్తమ చిత్రంతో సహా అయిదు అవార్డులు వచ్చాయి.
ఉత్తమ దర్శకుడిగా విధు వినోద్ చోప్రా, ఉత్తమ నటుడిగా విక్రాంత్ మాస్సే, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ చిత్రంగా అవార్డులని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఈ సినిమాలో ఇన్ని అవార్డులు వచ్చేంత ఏం ఉంది.. ఆ కథేంటంటే.. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం ఇది. మధ్యప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో మనోజ్ కుమార్ శర్మ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. మనోజ్ వాళ్ళ నాన్న డ్యూటీలో నిజాయితీగా ఉన్నాడని అతడిని సస్పెండ్ చేస్తారు. ఇక వారి జీవితం గడవడం మరింత కష్టమవుతుంది. ఇక మనోజ్ చదివే స్కూల్ ప్రిన్సిపల్ కాపీ కొట్టమని తనే స్వయంగా ప్రోత్సాహిస్తాడు. ఈ విషయం అక్కడి డీఎస్పీ దుష్యంత్( ప్రియాన్షు ఛటర్జీ) కి తెలియడంతో ఆ స్కూల్ ప్రిన్సిపల్ ని జైలుకి పంపిస్తాడు. ఇక ఆ సంవత్సరం మనోజ్ కుమార్ 12th ఫెయిల్ అవుతాడు. మరి డీఎస్పీ దుష్యంత్ మాటలని స్పూర్తిగా తీసుకున్న మనోజ్ ఏం చేశాడు? ఈ క్రమంలో మనోజ్ కి ఎదురైన సవాళ్ళేంటనేది మిగతా కథ.
ఈ సినిమాని ఎందుకు చూడాలంటే.. సక్సెస్ ఫుల్ లైఫ్ స్టోరీని ఎవరైనా చూస్తారు. కానీ ఓ ఫెయిల్యూర్ లో నుండి ఎలా సక్సెస్ వైపు నడిచాడు అనే రియల్ స్టోరీని అందరు చూడాలనుకుంటారు. జీవితంలో ప్రతీ ఒక్కరు చూడాల్సిన సినిమాల్లో ఈ సినిమా ఒకటి. మనిషి ఎదుగుదలకి చదువు ఎంతో ముఖ్యం. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వైపు మనం రెగ్యులర్ గా ఓ న్యూస్ చూస్తుంటాం.. సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కొంతమంది వారికి దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్ కి వచ్చి అక్కడి లైట్ల వెలుగులో రాత్రంతా చదువుకుంటారని మనం పేపర్స్ లో రెగ్యులర్ గా చూస్తుంటాం. అలాంటి ఓ పేద కుటుంబాన్ని వచ్చిన ఓ సాధారణ మనిషి కన్న కలని నిజం చేసుకోడానికి ఏం చేశాడు?
అసలేలా ఐఏఎస్ పాసయ్యాడనేది ప్రతీ ఒక్కరికి జీవితానికి ఓ స్పూర్తిగా నిలుస్తుంది. సివిల్స్ ఎగ్జామ్ పాస్ అయిన ప్రతీ ఒక్కరికి ఇంటర్వూ ఉంటుంది. అందులో అడిగే ప్రశ్నలకి చాలామంది సరైన సమాధానాలు చెప్పలేరు. అంత క్లిష్టమైన ఇంటర్వూలో మనోజ్ చెప్పిన సమాధానాలు ఆ ఇంటర్వూ చేసే అధికారులని ఆలోచింపజేసేవిలా ఉన్నాయి. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఇంటర్వూకి సంబంధించిన కొన్ని బైట్స్ వస్తుంటాయి. ప్రతీ సంవత్సరం ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలని హత్తుకుంటాయి. అలాంటి చిత్రాల్లో 12th ఫెయిల్ ఒకటి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తెలుగు ఆడియోలో అందుబాటులో ఉంది.