Health Care

ఉద్యోగంలో ప్రమోషన్ రావట్లేదా..? అయితే, వారంలో ఆ రోజున ఇలా చేయండి..!


దిశ, ఫీచర్స్: జీవితంలో కొన్నిసార్లు మీరు ఎంత ప్రయత్నించినా, అస్సలు కలిసిరాదు. మరి ముఖ్యంగా మనం చేస్తున్న జాబ్ లో గ్రోత్ లేకపోతే చాలా బాధగా ఉంటుంది. ఎంత కష్టపడి పని చేసిన..మన బాస్ గుర్తించకపోతే తెలియని వేదనకు గురవుతుంటాము. కొంతమంది ఈ ఒత్తిడిని తట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి కొంత మంది పట్టువదలకుండా విజయం సాధించడానికి ప్రయత్నిస్తారు. ఇంకొందరు మన టైం బాలేదని వదిలేసి.. వారి పని వారు చేసుకుంటూ వెళ్తారు. కానీ మీరు జీవితంలో ఎంత కష్టపడినా.. అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే జీవితంలో అనుకున్నవన్నీ సాధించగలం. వృత్తిపరమైన ఎదుగుదల కనిపించని కొందరు వ్యక్తులు తరచుగా జ్యోతిష్యులను కలుస్తూ ఉంటారు. ఈ క్రమంలో సోమవారం రోజున ఉదయాన్నే స్నానం చేసి ఈ పరిహారాలు వాడితే వారం రోజుల్లోనే మీ జీవితం మారిపోతుందని నిపుణులు అంటున్నారు.

సోమవారం భోళా శంకరుడికి ఇష్టమైన రోజని మనందరికీ తెలిసిందే. ఆయనకు కేవలం ఒక కలశం నిండా నీరు పోసి, బిల్వపత్రాలు సమర్పిస్తే తెగ సంతోష పడిపోతారు. అంతే కాకుండా, ఒక్క సారి మనస్ఫూర్తిగా హర.. హర.. మహాదేవా.. అంటే చాలు.. భక్తుని బాధలను ఇట్టే.. మాయం చేస్తాడు. సోమవారం నాడు శివునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యితో అభిషేకం చేయాలి. అలాగే శివాలయానికి వెళ్లి రావి చెట్టు నీడలో దీపం వెలిగించాలి. చెట్టుకింద నల్ల చీమలన్నింటికీ చక్కెర వేయండి.

మీకు అవకాశం ఉంటే, ఈ రోజున పేదలకు డబ్బు కానీ దుస్తులు కానీ దానం చేయండి. ఇలా చేస్తే చాలా మంచిది. శివుడికి భస్మం అంటే చాలా ఇష్టం. ఈ కారణంగా, ఆయనకు భస్మం సమర్పించాలి. బిల్వ దళాలలో ఏక, ద్వి,త్రి దళం,పత్రాలు ఉంటాయి. అదేవిధంగా, తులసి దళాన్ని శివుడికి ఎప్పుడూ సమర్పించకూడదని గుర్తించుకోండి.



Source link

Related posts

చింత చెట్టును శపించిన రాధా రాణి ? కారణం ఏంటో తెలుసా

Oknews

మీరు కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతున్నారా..అయితే ఈ వ్యాధితో బాధపడుతున్నట్లే?

Oknews

10వ తరగతి పాసైన యువతకు గుడ్ న్యూస్.. రైల్వేలో మరో బంపర్ రిక్రూట్‌మెంట్..

Oknews

Leave a Comment